desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:32AM

ఎవరి ధీమా వారిదే...


గజ్వేల్‌: మెదక్‌ లోక్‌సభ ఉపఎన్నిక పోలి ంగ్‌ ముగియడంతో మూడు ప్రధానపార్టీల నాయకులు తమ అభ్యర్థి విజయం సాధిస్తాడనే విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. సీఎం ప్రాతిని ధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉన్నందున పోటీలో ఉన్న మూడు ప్రధానపార్టీలు ఈ నియోజకవర్గంలో వారం రోజులపాటు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత శుక్రవారం ఆయాపార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగారు.
కాగా అధికార టీఆర్‌ఎస్‌పార్టీలో పార్టీ అభ్యర్థి ఘనవిజయం ఖాయమని మితిమీరిన విశ్వాసం వ్యక్తమవుతున్నది. గత లోక్‌సభ ఎ న్నికలో టీఆర్‌ఎస్‌అభ్యర్థిగా పోటీచేసిన సీఎం కేసీఆర్‌కు గజ్వేల్‌ సెగ్మెంట్‌లో సుమారు 50 వేల ఓట్ల ఆధిక్యత లభించగా ఈ ఎన్నికల్లో సుమారు లక్షఓట్ల ఆధిక్యత సాధిస్తామన్న ధీ మా వ్యక్తంచేస్తున్నారు. గత సాధారణ ఎన్ని కల అనంతరం గడిచిన 3నెలల కాలంలో ని యోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఊహించని రీతిలో పుంజుకున్నందున గత లోక్‌సభ ఎన్నికల మె జార్టీతో పోలిస్తే రెట్టింపు మెజార్టీ ఖాయమంటున్నారు. కాగా కాంగ్రెస్‌పార్టీలోసైతం ఆ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని భావిస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో చాలామంది పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ గ్రామస్థాయి క్యాడర్‌ మాత్రం పార్టీఅభ్యర్థి గెలుపుకో సం ఉత్సాహంగా పనిచేసినందున సంప్రదా య ఓటుబ్యాంకును సొమ్ము చేసుకోగలిగామ ని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3నెలల కాలం లో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తమకు కొంతవరకు లాభించిందంటున్నారు. అనివార్య కారణాలవల్ల గత సాఽదారణ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి ఓటేసిన తమపార్టీ కార్యకర్తలు పలువురు మళ్లీ అలాంటి తప్పు చేయబోమం టూ కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా కష్టపడి పనిచేశారంటున్నారు.
ఇక టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమని రెండుపార్టీల నాయకులు ధీమావ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీలో నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీకి దూరమైనప్పటికీ గ్రామస్థాయిలో పార్టీ చెక్కుచెదరకపోగా మిగిలిన కార్య కర్తల్లో ఉత్సాహం పెరిగిందంటున్నారు. గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన సభకు హాజరైన జనమే తమ పార్టీ అభ్యర్థి విజయాన్ని సూచిస్తున్నదంటున్నారు. ఇలా మూడు పార్టీ ల నాయకుల్లో ఎవరికివారే ధీమా వ్యక్తం చే స్తున్నారు.