Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:31AM

‘సేవా దృక్పథంతో వ్యవహరించాలి’


నారాయణఖేడ్‌: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సేవా దృక్పథంతో వ్యవహరించి విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని జోగిపేట డివిజన్‌ ఉప విద్యాధికారి పోమ్యానాయక్‌ అన్నారు. శనివారం నారాయణఖేడ్‌లోని బ్రిలియంట్‌ పాఠశాలలో డిప్యూటీ డీఈవో పోమ్యానాయక్‌ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన సందర్భంగా ఆయనకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సన్మానం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్‌ లాంటి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు నిరుపేదలకు విద్యను అందించడానికి సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రధానంగా పోటీ తత్వం అవసరమైనప్పటికీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి విద్యాభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లోనూ పాల్గొనాలన్నారు. సైన్స్‌ఫేర్‌లలోనూ ప్రైవేటు పాఠశాలల వారు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మనూరు, కల్హేర్‌ ఎంఈవోలు అరవింద్‌కుమార్‌, మన్మదకిషోర్‌, ప్రైవేటు పాఠశాలల కమిటి బాధ్యులు సతీష్‌షెట్కార్‌, ప్రకాశ్‌, మహాదేవ్‌రావు, నహీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప విద్యాధికారి పోమ్యానాయక్‌ను ఘనంగా సన్మానించారు. జు‘ ఛిజ్చూటట=‘్టౌఞఝజీుఽజీజూుఽజ్కుః൹ఝడ