Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:31AM

సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక

నారాయణఖేడ్‌: సీజనల్‌ వ్యాధుల నిర్మూలన కోసం నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించినట్లు క్లస్టర్‌ వైద్యాధికారి గాయత్రీదేవి తెలిపారు. శనివారం నారాయణఖేడ్‌లోని క్లస్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సిబ్బంది ద్వారా ప్రతి రోజూ ఒక్కొక్క గ్రామంలో వైద్య శిబిరాలను నిర్వహించే విధంగా ప్రణాళికను తయారు చేయించామన్నారు. ప్రధానంగా పరిశుభ్రత లోపించడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను బుజించడం వల్ల వ్యాధులు సోకుతాయన్నారు. నారాయణఖేడ్‌ ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో అతిసార సోకిన వారిని పరిశీలించామని, అధిక శాతం కలుషితమైన ఆహారం తినడంవల్లే వ్యాధి బారిన పడినారన్నారు. వారు తుర్కపల్లి తండాతో పాటు పంచగామ తదితర గ్రామాలను సందర్శించామన్నారు. వర్షాకాలంలో ప్రజలు కాచివడపోసిన నీటిని తాగాలన్నారు. అంతేకాకుండా వేడివేడి పదార్థాలను మాత్రమే బుజించాలన్నారు. తాము నివసిస్తున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల ద్వారా తాగునీటి పథకాల ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతో పాటు క్లోరినేషన్‌ కూడా చేయించాలన్నారు. మురుగు కాలువలను కూడా శుభ్రం చేయించాలని, తాగునీటి పథకం పైప్‌లైన్‌ లీకేజీలను కూడా తొలగింపచేయాలన్నారు. ప్రస్తుతం టైపాయిడ్‌ లాంటి జ్వరాలు కూడా అధికంగా వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో నిజాంపేట వైద్యాధికారిణి పద్మావతి, హెల్త్‌సూపర్‌వైజర్‌ చంద్రశేఖర్‌, సిబ్బంది భాస్కర్‌, గోపినాథ్‌ ఉన్నారు. ం ఎం్ట్స్రడఫిౖ