Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:20AM

ఓర్వలేకనే కాంగ్రెస్‌ ఆందోళనలు


- రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్‌ పుణ్యమే - కేసీఆర్‌ను విమర్శించే అర్హత ఆ పార్టీకి లేదు
- టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి

సుభాష్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగుతుందని టీ ఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మం డిపడ్డారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమేనన్నారు. పదేళ్లుగా ఏ రైతును కూడా పట్టించుకోని కాంగ్రెస్‌ రైతుల అన్ని పథకాల ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు, పథకాలను చూసి ఓర్వలేక అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే కరెంట్‌ కష్టాలు వచ్చాయనీ, ఆ కష్టాలను తమ ప్రభుత్వం తీరుస్తుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఇబ్బం దులు ఎదుర్కొన్నారనీ, తమ ప్రభుత్వం సరైన సమయానికి కొరత లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. రైతుల రుణమాఫీకి ఒక పద్ధతి ప్రకారం వెళ్తుందనీ, ఈ నెల 25వ తేదీలోగా అర్హులైన రైతులందరికీ రుణాలు అందజేస్తామన్నారు. ఎస్టీలకు 4 వేల కుటుంబాలకు భూమి పంపిణీ చేశామనీ, ఎ న్నికల మేనిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మీ అనే పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అర్హు లైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగుల కు పెన్షన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజల నుంచి మం చి ఆదరణ లభిస్తుందనీ, దీనిని చూసి ఓర్వ లేక అక్కసుతో కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై విషం చిమ్ముతుందని మండిపడ్డారు. కేసీఆర్‌ను గానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత కాంగ్రెస్‌, ఆ నాయకులకు లేదన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వస్తుందన్నారు. టీడీపీ నాయకుడైన ప్రకాష్‌ టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఏఎస్‌ పో శెట్టి, లక్ష్మణ్‌రావు, తారిక్‌ అన్సారీ, రాజారెడ్డి, రా ములు, చంద్రం, అక్తర్‌, రాంరెడ్డి, రవీందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇు2ఊ4ఔఇుఽ4ఔఇు్‌షఞ’లీ)గీంభి)