Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:03AM

పునర్నిర్మాణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకం

జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం
మంచిర్యాల టౌన్‌, సెప్టెంబర్‌ 13 : ప్రజల సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ పునఃనిర్మాణంలో విద్యావంతుల వేదిక కీలక భూమికను పోషిస్తుందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. శనివారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భావం జరిగినప్పటి నుంచి పోలీసుల నిర్బంధం కొనసాగుతోందన్నారు. మొదట తెలంగాణ మేధావుల వేదికను ఏర్పాటుచేయగా దీనిని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విద్యావంతుల వేదికగా మార్చారని గుర్తుచేశారు. 2004 సంవత్సరంలో ఏర్పాటైన విద్యావంతుల వేదిక ఎన్నో ఉద్యమాలకు వేదిక కాగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్రను పోషించిందన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో రాష్ట్రస్థాయి దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు పలువురు మేధావులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఏబీఎన్‌, టీవీ9 ఛానళ్ల నిషేధంపై విలేకరులు ప్రశ్నించగా టీవీ ఛానళ్లు, ఎంఎస్‌ఓలు సమన్వయంతో వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని బదులిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇరుపక్షాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేసే అవకాశాలు ఉంటాయన్నారు. సమావేశంలో దశాబ్ది ఉత్సవాల కన్వీనర్‌ గురిజాల రవీందర్‌రావు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పోడేటి రవీందర్‌, నాయకులు కమల్‌, మధుసూదన్‌రావు, లింగారెడ్డి, ఎ సాఽగర్‌, శ్యాంసుందర్‌రావు, గోషిక మల్లేష్‌, జాఫర్‌ పాల్గొన్నారు.్‌)0ోఖీ