Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:02AM

జూరాలకు పోటెత్తిన వరద

 16 గేట్ల ద్వారా నీటి విడుదల
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటితో పాటు, స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టిలో 519.60 మీటర్లలో నీటి నిల్వ ఉండగా ప్రాజెక్టులో 52,200 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదైంది. నారాయణపూర్‌ లో 491.65 మీటర్లలో నీటి నిల్వ ఉండగా ప్రాజెక్టులో 61,200 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి 10 గేట్లను ఒక మీటరు ఎత్తు తెరచి 63,700 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులో 318.45 మీటర్లలో నీటి నిల్వ ఉండగా 1,10,000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా నమోదుకాగా 16 గేట్లను ఒక మీటరు ఎత్తు తెరచి 1,11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన కోసం 43,200 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా 6 యూనిట్లలో 193 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు.