Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 01:01AM

నేడు చెంచుపల్లిలో మెగా వైద్యశిబిరం

నిమ్స్‌కు చెందిన 20 మంది డాక్టర్ల రాక
చెంచుల ఇంటింటికీ టీవీ
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన స్పీకర్‌ మధుసూదనాచారి

పరకాల, సెప్టెంబర్‌ 13 : వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని చెంచుపల్లిలో ఆదివారం మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. శనివారం పరకాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి పేపర్‌లో ప్రచురితమైన ‘ఆధునిక యుగంలో ఆటవిక బతుకులు’ అనే కథనానికి స్పందించిన ఆయన చెంచుపల్లిలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నాటు వైద్యమే దిక్కైన చెంచులకు కార్పొరేట్‌ స్థాయిలో మెగావైద్యం అందించేందుకు హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రముఖులైన 20 మంది వైద్యులను చెంచుకాలనీకి రప్పిస్తున్నట్లు తెలిపారు. చెంచుపల్లిలో 75 కుటుంబాలు ఉండగా, వీరికి ఆధునికతను అందించి ప్రపంచాన్ని కళ్లముందు ఉంచేందుకు ప్రతి ఇంటికి టీవీలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక యుగంలో మనుషుల మధ్య అనాగరికంగా బతుకుతున్న చెంచుల జీవన విధానం తనను కలచివేసిందన్నారు. చిట్యాల మండలం బావుసింగ్‌పల్లి శివారు గ్రామానికి చెందిన చెంచులను ప్రత్యేక బస్సుల ద్వారా చెంచుపల్లికి తరలించి వైద్యసేవలు అందించనున్నట్లు స్పీకర్‌ వెల్లడించారు.80ఆఆ2అఉ59ఆ