Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:57AM

దేవాలయాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి:లక్ష్మణ్‌

చిక్కడపల్లి/హైదరాబాద్‌ : తెలంగాణాలోని దేవాలయాల ఉద్యోగుల సమస్యల సాధన కోసం కృషి చేస్తానని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ దేవాలయాల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా జీతాలను ఇప్పించే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీనిచ్చారు.