Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:56AM

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి : టీజీవీపీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా టీజీవీపీ, ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంతోపాటు కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ఇంటికి వినతిపత్రాన్ని అందించారు. బోధన్‌ పట్టణంలో శక్కర్‌నగర్‌ చౌరస్తా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. నవీపేటలో టీజీవీపీ ఆధ్వర్యంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.