Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:56AM

ప్రత్యేక జిల్లా కోసం కామారెడ్డిలో మొదలైన పోరు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 : ప్రత్యేక జిల్లా కోసం నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలో పోరు మొదలైంది. ఈ మేరకు శనివారం జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా సాధన కమిటీ ఏర్పాటైంది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన తొలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోనే కామారెడ్డిని కొనసాగించాలని, లేకుంటే కామారెడ్డిని జిల్లాగా ప్రకటించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత కామారెడ్డి మండలానికి బ్రిగేడియర్‌గా పనిచేసి ఉద్యమాన్ని ప్రారంభించిన చరిత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు స్పందించి వెంటనే కామారెడ్డిని జిల్లాగా ప్రకటించాలని సమావేశంలో పలువురు ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేశారు.