desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:44AM

శ్రీనివాసన్‌ కోసం కాదు జైట్లీ కోసమే మార్చాం: శశాంక్‌

న్యూఢిల్లీ: బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా చూడాలనుందని బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ పేర్కొన్నాడు. అందుకోసమే 2012లో బీసీసీఐ నియమావళిని సవరించామని అన్నాడు. ఈ ఏడాది శ్రీనివాసన్‌కు బదులుగా బోర్డు పగ్గాలు చేపట్టేందుకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు అయిన జైట్లీనే అన్ని విధాలుగా అర్హుడని అన్నాడు. ఈ సవరణ ప్రకారం ఇప్పటిదాకా అధికారంలోకి రాని జోన్‌... అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు.