Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:44AM

పేస్‌ జోడీ అనూహ్య విజయం

డేవిస్‌ కప్‌లో భారత్‌ ఆశలు సజీవం
2-1కి తగ్గిన సెర్బియా ఆధిక్యం
బెంగళూరు: రోహన్‌ బోపన్నతో కలసి లియాండర్‌ పేస్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడు. దీంతో విజయం అంచున నిలిచిన సెర్బియాపై పేస్‌ జోడీ ఉత్కంఠభరిత విజయం నమోదు చేసింది. శనివారమిక్కడ జరిగిన డబుల్స్‌లో లియాండ్‌ పేస్‌-రోహన్‌ బోపన్న జోడీ 1-6, 6-7(4), 6-3, 6-3, 8-6తో సెర్బియా జంట నెనాడ్‌ జిమోన్‌జిచ్‌-లిజా బొజోల్‌జాచ్‌పై నాటకీయ విజయం సాధించింది. దీంతో డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూప్‌ ప్లే ఆఫ్‌లో సెర్బియా ఆధ్యికం 2-1కి తగ్గింది. వచ్చే సీజన్‌కు భారత్‌ వరల్డ్‌ గ్రూప్‌కు చేరాలంటే.. ఆదివారం జరిగే రెండు సింగిల్స్‌లోనూ తప్పక నెగ్గాలి. తొలి రెండు సెట్లు కోల్పోయి ఒత్తిడికి గురైన పేస్‌-బోపన్న జోడీ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుంది. మూడో సెట్‌ ఆరో గేమ్‌లో జిమోన్‌జిచ్‌ సర్వీసును బ్రేక్‌ చేసిన భారత్‌ జోడీ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. మూడు, నాలుగు సెట్లను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఐదో సెట్‌లో సెర్బియా జోడీ తీవ్రమైన పోటీనిచ్చింది. కానీ 14వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన పేస్‌ జోడీ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.




రీ