Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:44AM

నార్తర్న్‌ శుభారంభం


చాంపియన్స్‌ లీగ్‌ టీ20 క్వాలిఫయింగ్‌లో నార్తర్న్‌ డిసి్ట్రక్ట్స్‌ శుభారంభం చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో న్యూజిలాండ్‌కు చెందిన నార్తర్న్‌ జట్టు ఏడు వికెట్లతో శ్రీలంకకు చెందిన సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌ను చిత్తు చేసింది. ముందురోజు కురిసిన వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో పది ఓవర్లకు కుదించారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సదరన్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 93 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్‌ పెరీర (20 బంతుల్లో 7 ఫోర్లతో 37), దనుష్క గుణతిలక (26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. 93 పరుగుల లక్ష్యాన్ని నార్తర్న్‌ మరో మూడు బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. సదరన్‌ బౌలర్‌ ఫర్వేజ్‌ మహరూఫ్‌ రెండు వికెట్లు తీశాడు. నార్తర్న్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో నార్తర్న్‌ నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. విలియమ్సన్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు:
సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌: 10 ఓవర్లలో 92/5 (గుణతిలక 39, పెరెరా 37; బౌల్ట్‌ 2/12); నార్తర్న్‌ డిసి్ట్రక్ట్స్‌: 9.3 ఓవర్లలో 96/3 (విలియమ్సన్‌ 52, డెవ్‌సిచ్‌ 14; ఫిన్‌ 14, మహరూఫ్‌ 2/14).