Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:43AM

విండీస్‌తో సిరీస్‌కు షెడ్యూల్‌ మార్పు

న్యూఢిల్లీ: భారత్‌-వెస్టిండీస్‌ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్‌ 11న జరగాల్సిన రెం డో వన్డేకు బదులు.. అక్టోబర్‌ 14న జరిగే మూడో వన్డేకు విశాఖపట్టణం ఆతిథ్యమివ్వనుంది. ఢిల్లీలో టి-20 బదులు అక్టోబర్‌ 11న రెండో వన్డే నిర్వహించనున్నారు. కటక్‌కు వన్డే బదులు టీ20ని కేటాయించారు. ఇది అక్టోబర్‌ 22న జరగనుంది. కోల్‌కాతా అక్టోబర్‌ 20న జరిగే ఐదో వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది. నాలుగో వన్డే ధర్మశాలలో నిర్వహిస్తారు. టెస్టులకు ముందు వెస్టిండీస్‌ జట్టు అక్టోబర్‌ 25 నుంచి కాన్పూర్‌ వేదికగా బోర్డ్‌ ప్రెసిడెంట్‌ ఎలెవన్‌తో మూడు రోజుల ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 30 నుంచి మూడు టెస్టుల సిరీస్‌ మొదలుకానుంది.


6