Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

ఈ- పేమెంట్‌కు ఆగిన చెల్లింపులు

నెల్లూరు - హరనాథపురం : ఈ- పే మెంట్‌ విధానంలో బిల్లుల చెల్లింపులకు ప్రభు త్వం చర్యలు తీసుకున్నా, సాంకేతిక లోపం కా రణంగా చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో 12 రోజుల నుంచి ఉద్యోగులకు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు.
తొలుత జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ- పేమెంట్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడంతో విజయవంతమైంది. జూన్‌ నుంచి జిల్లాలో ఈ- పేమెంట్‌ పద్దతిలో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నారు. ఆగస్టు వరకు ఈ ప్రక్రియ స జావుగా సాగింది. జిల్లాలో విజయవంతం కావడంతో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సె ప్టెంబరు నుంచి ఈ విధానాన్ని అమలు చేశా రు. 13 జిల్లాల్లోని ఖజానా కార్యాలయాలతో పాటు ఉప ఖజానా కార్యాలయాల్లో ఈ-పే మెంట్‌ను ఒకే సారి అమలుల్లోకి తేవడంతో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనికితోడు ఫిపో పద్దతిలో అంటే ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ ఓన్హ్‌ విధానం లో జీతాల చెల్లింపులు చేపట్టాలని, రాష్ట్ర ఖజా నా శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో బిల్లులను ఇష్టమొచ్చినట్లు ఆమోదించను అవ కాశం లేకుండా పోయింది. ఈ పద్దతి రాష్ట్ర వ్యాప్తంగా కచ్చితంగా అమలు జరగడంతో ప్ర తీ బిల్లును ఒక క్రమ పద్దతిలో పరిశీలించి ఆ మోద ముద్ర వేసే వీలు కలిగింది. ముందొచ్చి న బిల్లులను పక్కన పెట్టి నచ్చిన బిల్లులను ఆమోదించే ప్రక్రియను చెక్‌ పెట్టారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే సెప్టెంబరు 1 నుంచి ఈ-పేమెంట్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉపాధ్యాయులకు మరికొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రమే ఆ నెలలో చె ల్లింపులు జరిగాయి. ముఖ్యమైన శాఖల ఉద్యో గులకు జీతాల చెల్లింపులు ఆగిపోవడంతో వా రు ఖజానా చుట్టూ తిరుగుతూ అవస్థలు ప డుతున్నారు. ఈ సందర్భంలోనే ఈ-పేమెంట్‌ సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.