Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

ప్రహసనంగా ‘స్మార్ట్‌’

నెల్లూరు - రంగనాయకులపేట: ప్రతి ఒక్కరికి పని కల్పించి ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ఆచరణ లో పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. స్మా ర్ట్‌ కార్డు ఉంటేనే కూలీ అందజేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టంగా ప్రకటించడంతో జిల్లా లో ఉపాధి పనులు చేసిన వేలాది మందికి వే తనం అందటం లేదు. రెండున్నర ఏళ్ల క్రితం ప్రారంభించిన స్మార్ట్‌ కార్డులు ప్రహసనంగా మారాయి. నేటికి పూర్తి స్థాయిలో స్మార్ట్‌ కార్డులు అందకపోవడంతో ఎంతో మంది కూలీ లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.
రూ. 4 కోట్ల బకాయిలు
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 5.45 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరికి నేటికి కూడా స్మార్ట్‌ కార్డు అందలేదు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించి ఉపాధి కూ లీలకు ఫొటోలు, వేలి ము ద్రలు తీసి స్మార్ట్‌ కార్డులు ఇవ్వాల్సి ఉన్న రెండున్నర ఏళ్లుగా నత్తనడకగా సాగిస్తూనే ఉన్నారు. స్మార్ట్‌ కా ర్డులు లేకపోవడం వల్ల నే టికి 23 వేల మందికి బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. సుమారు రూ. 4 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
స్మార్ట్‌ కార్డుల కోసం కాంట్రాక్ట్‌ కుదుర్చుకు న్న ఇంటరాక్ట్‌ సంస్థ స్మార్ట్‌ కార్డులు పూర్తి స్థా యిలో అందించడంలో విఫలమయిందన్న వి మర్శలున్నాయి. అనేక మండలాల్లో ఉపాధి కూలీలకు మూడు, నాలుగుసార్లు ఫొటో ప్రక్రియను చేసిన కార్డులను మాత్రం అందించడం లేదు. ఎక్కువగా ఇవి ఫెయిల్‌ అయ్యాయం టూ సమాచారం పంపుతున్నారు. అందుకు ముందు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న సీడ్‌ సంస్థ కూడా స్మార్ట్‌ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యా న్ని చేయడంతో పాటు లోపాల వల్ల కాంట్రాక్ట్‌ పొగొట్టుకున్న విషయం తెలిసిందే.

11వేల మంది సమాచారం
తీసుకువచ్చాం

ఉపాధిహామీ పఽథకంలో వేతనాలు ఆగిపోయిన 11 వేల మంది సమాచారాన్ని ఇప్పటికే సేకరించాం. వీరికి ఆధార్‌ కార్డులకు అనుసంధానం చేసి వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- వెంకట్రావు, ఇంటరాక్ట్‌ కో-ఆర్డినేటర్‌

ఆధార్‌తో మాన్యువల్‌ చెల్లింపులు

నాలుగు కోట్ల వేతనాలను ఉపాధి కూలీలకు చెల్లించాల్సి ఉంది. ఆధార్‌ కార్డుతో ఎన్‌రోల్‌మెంట్‌ను పూర్తి చేసి వీరికి వేతనాలు చెల్లించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అను మతి తీసుకున్నాం. నిలిచిపోయిన వారందరికి వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశాం.
- ఎం.గౌతమి, డ్వామా పీడీ