Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

అధికారమే అజెండాగా ముందుకు..


నాయుడుపేట : బహుజనులకు అధికారమే అజెండాగా ముందుకు సాగాలని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. నాయుడుపేటలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో శనివారం ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించి అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రతి కార్యకర్తా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ అత్యధిక ఓట్ల శాతాన్ని నమోదు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బహుజన సమాజ్‌పార్టీ కాంగ్రెస్‌, బీజేపీలకు దీటుగా ఎదిగిందని, ఈ నేపథ్యంలో అధికారం కైవసం చేసుకోవడం ఎంతో దూరంలో లేదంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాళెపు మస్తానయ్య, జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, ఉపాధ్యక్షుడు దారా కోటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చెంగల్‌రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇ. చారువాక, నియోజకవర్గ అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు డీవీ కృష్ణయ్య, శేషయ్య, గాడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కాలుష్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
నెల్లూరు - జెండావీధి: కాలుష్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జిల్లా ప్రజలు పోరాడాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు జి.మాల్యాద్రి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు సౌకర్యవంతమైన ఎన్నో సదుపాయాలు సమకూర్చి పెట్టిందన్నారు. కరెంట్‌ లేనిదే మనం బతకలేమనే స్థితిలోకి చేర్చిందన్నారు. దీంతో ఇబ్బడిముబ్బడిగా బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి(థర్మల్‌) వల్ల విషవాయువులు గాలిలో కలిసిపోతూ పర్యావరణాన్ని కాలుష్యంబారిన పడేట్లు చేస్తున్నాయి. దీంతో సెప్టెంబరు లో కూడా 35 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. భూమి వేడెక్కడం వల్ల వానలు కురవకపోవడం, పంటలు పండకపోవడం, జీవరాశి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ నెల 18న నేలటూరులో జెన్‌కో తలపెట్టిన థర్మల్‌ పవర్‌ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలు వెలిబుచ్చాయన్నారు. స్మార్టు సిటీలతో పచ్చటి పల్లెల్ని బొగ్గు అగ్గిలో ముంచేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఓపీడీఆర్‌ కార్యదర్శి శివశంకర్‌, జేవీవీ జిల్లా కార్యదర్శి వీ.చక్రపాణి, మస్తానమ్మ, అన్నామణి తదితరులు పాల్గొన్నారు.