Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తోంది చంద్ర బాబే!

. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల

నెల్లూరు - బారకాసు: రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి అనేక పఽథకాలు అమలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ మున్వర్‌బాషా అధ్యక్షతన జిల్లా మైనారిటీ సెల్‌ కమిటీ సమావేశం శనివారం జరిగింది. చేజర్ల మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో రాష్ట్రంలో వక్ఫ్‌ బోర్డుకు చెందిన వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైందన్నారు. జిల్లాలోనే రెండు వేల ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పారు. ఈ పరిస్థితిలో వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇస్లాం బ్యాంక్‌ను చంద్రబాబు త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు.
పలు తీర్మానాలు
ఈ సందర్భంగా మైనారిటీ కార్యవర్గం పలు తీర్మానాలు చేసింది.
ఫ జిల్లావ్యాప్తంగా ఉన్న మసీదులకు మరమ్మతులు చేయించి వాటికి పూర్వవైభవం వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని
ఫ మసీదుల్లో ఉండే ఇమామ్‌లకు నెలసరి వేతనం చెల్లించాలని
ఫ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా నేరుగా రుణాలు ఇచ్చే విధానం అమలు చేయాలని
ఫ అర్హులైన పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం తరపున 50 వేల ఆర్థిక సాయం ఇప్పించాలని
ఫ ముస్లిం యువతకు ఐదు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, హజ్‌యాత్రకు వెళ్లే వారికి చార్జీల్లో రాయితీ కల్పించాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ ఖాజావలీ, కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్‌బాషా, జిల్లా కార్యదర్శి మొహిద్దీన్‌, మైనారిటీ సెల్‌ జిల్లా మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి సర్ధార్‌, కిర్మానీహుస్సేన్‌, నగర అధ్యక్షుడు షేక్‌ ఆసీఫ్‌బాషా, ప్రధాన కార్యదర్శి షేక్‌ జాఫర్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి అమృల్లా, సైదుబాషా, పఠాన్‌ బాషా, నౌషాద్‌, ఖాదర్‌బాషా షాజహాన్‌ పాల్గొన్నారు.