Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

ఉత్సవాలకు కొత్తమ్మతల్లి ఆలయం ముస్తాబు

కోటబొమ్మాళి: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి గాం చిన స్థానిక కొత్తమ్మతల్లి ఉత్సవం ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహిం చనున్నారు. ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవ నిర్వహణ కమిటీ, గానీ, ఆలయ కమిటీ గానీ నియమించకున్నా గతంలో ఎన్నడులేని విధంగా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ మేనేజర్‌ వాకచర్ల రాధాకృష్ణ్ణ, గ్రామపెద్ద, టీడీపీ మం డల అధ్యక్షుడు బోయిన రమేష్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలంలో కావడం తో ఆయన కనుసన్నలలో ఈ ఉత్సవాలు వైభ వోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చే స్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కా కుం డా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున భ క్తులు ఈ ఉత్సవానికి వస్తుంటారు. అందుకు తగినట్టుగా భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, వ సతులు కల్పించనున్నారు. మూడురోజుల పా టు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు హైదరాబా ద్‌ వారిచే మ్యూజికల్‌నైట్‌ ఆర్కెసా్ట్ర, రెండో రోజు మయసభ- పడకసీను, తులసీ జలం ధర్‌, చివరిరోజు రామాంజనేయ యుద్ధం, గ యోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కబడ్డీ, వాలీబాల్‌, సంగిడీలు, ఉలవల బస్తాల పోటీలు ఉంటాయని ఆలయ మేనేజర్‌ వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రా షా్ట్రల నుంచి జయంట్‌వీల్‌, రంగుల రాట్నం, ఈఫిల్‌టవర్‌, చార్మినార్‌ వంటి ఆట సామగ్రి కోటబొమ్మాళి చేరుకున్నాయి. అమ్మవారి ఆ ల య ప్రాంగణాన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఫఅ