Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

ఎట్టకేలకు పింఛన్లు

కొంకడివరంలో పంపిణీ చేసిన అధికారులు
గరుగుబిల్లి : మండలంలోని కొంకడివరం పంచాయతీలో శనివారం పింఛన్లు పంపిణీ చేపట్టారు. కొన్నాళ్లుగా పింఛనుదారులకు సక్రమంగా అందకపోవడంతో పలుమార్లు అధికారులకు తెలియపర్చినా అమలు జరగని పరిస్థితి ఉండేది. పింఛనుదారులతో పాటు ఉపాధి వేతనదారులకు వేతనాలు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామానికి చెందిన 100 మందికిపైగా గురువారం మండల అభి వృద్ధి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ద్వారపురెడ్డి ధనుంజ యరావు సంబంధిత పోస్టల్‌ అధికారు లకు తెలియపర్చారు. బీపీఎం నిర్లక్ష్యం కారణం గా చెల్లింపులు జరగకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని సర్పంచ్‌ అల్లు అప్పలనాయుడు, ధనుంజయరావు, ఎంపీడీవో జి.పార్వతిల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులు స్పందించి పింఛనుదారులకు పింఛన్లు అందేలా చేస్తామని తెలిపారు. ఈ మేరకు ధనుంజయరావు సమక్షంలో బీపీఎం బి.సింహాచలం పింఛన్లు అందించారు. ఇదిలాఉండగా గత మూడు నెలలుగా ఉపాధి పనులు నిర్వహించిన తమకు వేతనాలు అందలేదని ధనుంజయరావు దృష్టికి గ్రామ స్థులు తీసుకువచ్చారు. దీనిపై సంబ ంధిత ఎఫ్‌ఏ జె.శ్రీనివాసరావును ఎందుకు అందలే దని ప్రశ్నించారు. నూతనంగా పలువురికి ఖాతాలు తెరిచామని, అందాల్సిన మొత్తంపై సంబంధిత ఉపాధి అధికారులకు తెలియపర్చామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటే చర్యలు తప్పవన్నారు. సమాచారాన్ని విధిగా ప్రజాప్రతినిధులకు తెలియపర్చాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అల్లు అప్పలనాయు డుతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.