Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:28AM

సీఎస్‌డీటీకి పెరుగుతున్న గిరాకీ

(నెల్లూరు - కలెక్టరేట్‌)
ఫసర్‌.. నేను మీ కులపోణ్ని . ఎలాగైనా ఆత్మకూరు సివిల్‌ సప్లయ్‌ డిప్యూటి తహసీల్దారు (సీఎస్‌డీటీ) పోస్టు నాకే రావాలి. అందుకు ఎంతైనా ఖర్చుపెట్టుకుంటా. ఈ ఒక్క సాయం చేయండి.. మీ మేలుమరువను. ఎప్పటికైనా మనం మనం ఒక్కటే. అక్కడ మీకేం కావాలో నేను చూసుకుంటా..
ఫఅన్నా మన ఎమ్మెల్యేకి నీవైనా చెప్పి ఆత్మకూరు సీఎస్‌డీటీగా పోస్టింగ్‌ ఇప్పించవా ? కొత్తగా నాకు పదోన్నతి వచ్చింది. కలెక్టరేట్‌, డీఎస్‌వో ఆఫీసులో అంతా మేనేజ్‌ చేసుకున్న ఎమ్మెల్యే సిఫార్సు పత్రం ఉంటే పనైపోతుందన్నా.. ఖర్చు ఎంతైనా నేను చూసుకుంటా. ప్రిస్టేజ్‌కి వచ్చింది. ఆ పోస్టు ఎలాగైనా మనకే రావాలి.
ఇదండీ.. రెవెన్యూలో జరుగుతున్న బదిలీ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు. రెవెన్యూశాఖలో 11 మంది సీనియర్‌ సహాయకులు డీటీలుగా పదోన్నతి పొందారు. వీరికి సీసీఎల్‌ఏ తాత్కాలిక పదోన్నతులు మాత్రమే కల్పించింది. పది నియోజకవర్గాల్లో ఎన్నికల డీటీలుగా ఉన్న వారికి డిసెంబర్‌ వరకు వారి విధులను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో డీటీల కొరత ఏర్పడటంతో హడావుడిగా సీసీఎల్‌ఏ తాత్కాలిక పదోన్నతలను కట్టబెట్టింది.
రెవెన్యూలో నిబంధనల ప్రకారం ఎన్నికల డీటీలకు బదిలీలు కల్పించి వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సీఎస్‌డీటీలుగా బదిలీ చేయాలి. కొత్తగా తాత్కాలిక పదోన్నతలు పొందిన జూనియర్లకు ఎన్నికల డీటీలుగా మార్చాల్సి ఉంది. తాజా ప్రక్రియ అందుకు భిన్నంగా మారింది. సీనియర్‌ సహాయకుల నుంచి డీటీలుగా పదోన్నతి పొందిన వారు ఏకంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా సీఎస్‌డీటీలుగా వెళ్తేందుకు భేరసారాలకు దిగారు. పైగా ఒక్కొక్క వ్యక్తి నలుగురు ఎమ్మెల్యేల వద్ద నుంచి సిఫార్సు పత్రాలతో అధికారులను కలవడం విశేషం.
ఆత్మకూరే ఎందుకు?
సీనియర్‌ సహాయకుల నుం చి డీటీలుగా పదోన్నతలు పొం దిన వారు ఆత్మకూరునే ఎందు కు కోరుకుంటున్నారు? అక్కడేముంది ? ఆ పోస్టుకు ఎందుకు అంత గిరాకీ ? ఈ ప్రశ్నలకు ఆశక్తికర సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆత్మకూరు సీఎస్‌డీటీకి కాలు కదపకుండానే నెలకు లక్ష లంచంగా చేరుతుందట. పైగా పనేముండదని అక్కడ నుంచి బయటకొచ్చిన అధికారులు అంటున్నారు. పౌరసరఫరాల శాఖకు అతడేబాస్‌. ఉన్నతాధికారులకు కూడ అతడే దండకాలు చేసి ముడుపులు పంపడం చేస్తాడని రెవెన్యూలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ బదిలీలపై దృష్టి సారించిన కలెక్టర్‌ పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారనే సమాచారం. జేసీ రేఖారాణి రాగానే బదిలీలు నిర్వహించనున్నారు.


3