Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:28AM

ఏఎంసీ చైర్మెన్‌ పదవిపై నేతల కన్ను ?

రాజాం: రాజాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైౖర్మెన్‌ పదవి కోసం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌, జూనియర్‌ నాయకులతో పాటు పలువురు ఆశావాహులు దృష్టి సారించారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగు తముళ్లు ఎ లాగైనా ఈ చైర్మెన్‌ గిరిని సాధించేందుకు పా వులు కదుపుతున్నారు. రాజాం ఏఎంసీ పరిధిలో రాజాం మండలంతో పాటు సంతకవిటి, రేగిడి, వంగర మండలాలు ఉన్నాయి. అత్యధిక ఆదాయం తెచ్చే ఈ వ్యవసాయమార్కెట్‌ చైర్మెన్‌ పదవిని దక్కించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ చార్జి ప్రతిభాభారతి ప్రధాన అనుచరులుగా గుర్తింపుపొందిన వారు ఈ పీఠాన్ని కైవశం చేసుకోవాలని పోటీ పడుతున్నారు. టీడీపీకి చెందిన ఇతర సీనియర్‌ నాయకులు కూడా బరిలో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వహయాంలో రాజాంనకు చెం దిన చెలికాని హరిబాబుకు వరుసగా రెండు పర్యాయాలు అవకాశం రాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సంతకవిటి మండలం హొం జరాం గ్రామానికి చెందిన సిరిపురపు కు మారస్వామికి, రేగిడి మండలం ఉనుకూరుకు చెందిన గేదెల వెంకటేశ్వరరావుకు ఛైర్మన్‌ పదవి దక్కింది.
అయితే టీడీపీ హయాంలో ఎవరికి దక్కుతుందోనని పలువురు ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు దక్కించుకోవాలన్న తాపత్రాయం పలువురిలో కనిపిస్తోంది. ఏఎం సీ చైర్మెనయితే నేరుగా రైతులతో సంబంధాలు పెంచుకునే అవకాశంతో పాటు ఇతరాత్ర లబ్ధిపొందవచ్చన్న అభిప్రాయంతో కూడా నాయకులు ఉన్నారు.ఖి