Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:27AM

వడ్డీలేని రుణాలు పంపిణీ


రామభద్రపురం : స్థానిక విశాఖ డెయిరీ కార్యాలయంలో మేనేజర్‌ రెడ్డి వరప్రసాద్‌ గజరాయనివలస పాడిరైతులు 27 మందికి 6 లక్షల 75వేలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వడ్డీలేని రుణాలు పంపిణీ డెయిరీ శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని పాడిరైతులు ఈ రుణాలను సక్రమంగా వినియోగించుకొని మేలు జాతి పాడిపశువులను కొనుగోలు చేసి అధిక పాలసేకరణకు తోడ్పడాలని కోరారు. అలాగే సుఖీభవ పథకంలో చేరి మరణించిన మూడ డ్ల లక్ష్ముం వారసులు సింహాచలంకు రూ 15వేలు అందజేసారు. జనశ్రీ బీమా పథకం గడువు వచ్చే నెలాఖరుతో ముగియనున్నందున తిరిగి పునరుద్దరించుకొనే వారు త్వరితగతిన సంఘాలు వారీగా జాబితాలు అందజేయాలని కోరారు. జనశ్రీ పథకం యొక్క ప్రీమియం 200ల రూపాయిలలో పాడిరైతు 50 శాతం చెల్లిస్తే మిగతాది డెయిరీ భరిస్తుందన్నారు. ఈ పథకంలో సహజ మరణానికి 30 వేలు, ప్రమాద మరణానికి 75 వేలు, శాశ్వత అంగవైకల్యానికి 70 వేలు బీమా పరిహారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పాడిరైతు ఈ పథకంలో చేరాలన్నారు. కార్యక్రమంలో డెయిరీ సూపర్‌వైజర్లు కొల్లిస్వామినాయుడు, నారాయణ, సన్యాసిరావు, తదితరులున్నారు.