Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:27AM

సీఎం పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

నరసన్నపేట: ఈనెల 17న సీఎం చంద్రబాబు రైతు సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా వేదికను వేసేందుకు శనివారం విజయవాడ నుంచి సుమారు 20 ట్రక్కుల్లో సామగ్రిని జూనియర్‌ కాలేజీ మైదా నానికి తీసుకువచ్చారు. హెలీప్యాడ్‌ నిర్మాణాని కి ఆర్‌అండ్‌బీ అధికారుల ఆధ్వర్యంలో తామ రాపల్లి శివారుల్లో శాలివాహన స్పిన్నింగ్‌ మిల్లు ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే ప్రజలతో సీఎం ముఖాముఖి జరిగే గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఎంపీడీవో, తహశీల్దార్లు అవగాహనపరిచారు. తామరాపల్లి, దేవాది గ్రా మాల్లో పరిశుభ్రత, విద్యుత్‌ దీపాలు వంటి వాటిని పునరుద్ధరించాలని డ్వామా పీడీ సూ చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీహరి, ఎంపీడీవో విద్యాసాగర్‌, తహశీ ల్దార్‌ ఎస్‌.సుధాసాగర్‌, పాల్గొన్నారు. ఈ పను లను సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ చిన్నంనాయుడు, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ చిట్టిబాబు తదితరులు పరిశీలించారు.
పూర్తి సమాచారంతో సిద్ధంకండి
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ప్రోగ్రాం ఇన్‌చార్జి, డ్వామా పీడీ కళ్యాణచక్రవ ర్తి అధికారులకు ఆదేశించారు. శనివారం జలు మూరు, నరసన్నపేట, పోలాకి, సారవకోట మండలాల అధికారులతో సమావేశం నిర్వ హించారు. ఆయా శాఖల వివరాలను గ్రామ స్థాయి నుంచి సేకరించి సిద్ధంగా ఉంచుకోవా లన్నారు. వచ్చేనెల 2 నుంచి పింఛన్‌ పెంచు తున్న నేపథ్యంలో ఇప్పటికే నిధులు కేటాయిం చిన విషయాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే సూ చించారు. రుణమాఫీకి అర్హులైన జాబితాలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సిద్ధం చే యాలన్నారు. రేషన్‌కార్డులు ఆధార్‌సీడింగ్‌ లేక పోవడంతో సరుకులు అందనివారి వివరాలను సేకరించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంత రం సభా ప్రాంగణాన్ని పీడీ కళ్యాణచక్రవర్తి, ఎమ్మెల్యే రమణమూర్తి పరిశీలించారు. ్త్స్రడిఫౖ