Sep 14 2014 @ 00:27AM

కష్టాల్లో..కస్తూర్బా విద్యార్థులు..శ్రీ

రేగిడి/వంగర :దేవుదల కస్తూర్బా పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకూ 200 మం ాద్యార్థులు చదువుతున్నా రు. వీరంతా నిరుపే కుటుంబాలకుచెందిన వారే. వీరి చదు వు సాగాలంటే ఆశ్రమ వసతిగృహాలే దిక్కు. ప్రభుత్వం ఎంతో ఆ ్భాటంగా ప్రకటించిన కస్తూర్బా పాఠశాలలో వీరు ఎంతో ఆశతో చేరారు. ప్రారంభించిన తొలినాళ్లలో విద్యార్థులకు వెురుగైన వసతులు, పౌిష్టకాహారంతో పాటు విద్యాబోఽదన సలకముం గా జరిగేది. కానీ ఇటకవల ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సరుకులు పక్కతోవపడుతున్నట్లు వివుర్శలు వినిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ఇటీవల పాఠశాలను సందర్శించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చా యి. ఈ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్క విద్యార్థికి ఉదయం అల్పాహారం, 11 గంటల సమయంలో బోర్నావిటా, మధ్యాహ్నం కందిపప్పు చారుతో భోజనం అందించాలి. సాయంకాలం స్నాక్స్‌, రాత్రి రసంతో పాటు ఒక కాయగూర భోజనం అందించాలి. వారానికి ఐదు రోజులు గు డ్లు, ఒకరోజు చికెన్‌తో పాటు స్నాక్స్‌, పళ్లు, సెనగగుడ్లు, స్వీట్లు, బిస్కెట్‌లు అందించాలి. అలాగే రోజుకు 30 లీటర్ల వరకు పాలు, టీ, బోర్నావిటా, మజ్జిగ రూపేనా విద్యార్థులకు అందించాలి. అయితే ఇక్కడ నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులు వారానికి మూడు రోజులే గుడ్లు పెడుతున్నారు. రెండు వందల మంది విద్యార్థినులకు మూడున్నర లీటర్ల పాలు, దోసెడు బోర్నావిటా కలిపి ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదేమని ప్రశ్నిస్తే సిబ్బంది నుంచి సమాధానమే కరువవుతోంది. పప్పుచారు పేరుకే. చూసేవారికి అది నీళ్లులా కనిపిస్తోంది. ఇక కూరల విషయం చెప్పనక్కర్లేదు. రెండు వంద ల మందికి రెండుకేజీల వంకాయలు అంటే ఏ విధంగా ఉం టుందో అవగతం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉదయం వండే పులిహోరానే మధ్యాహ్నం పెడుతున్నారన్న వ్యాఖ్యలు వి నిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల ద్వారా పూర్తిస్థాయిలో సరుకులు తెప్పించి విద్యార్థులక మెనూ ప్రకారం ఆహారం అందించాల్సిన అధికారులు ఆ విధంగా చేయడం లేదని తెలుస్తోంది. దీనిపై ప్రిన్సిపాల్‌ కె.గాయిత్రిని వివరణ అడుగగా ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, మీ గుర్తింపుకార్డులు చూపండని అడిగారు. మా అధికారులు ఎవర్నీ పాఠశాలలోకి రానీవ్వకూడదని ఆదేశించినట్టు చెప్పుకొచ్చారు.

అమ్మలా ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. చదువుతో పాటు సమయానికి ఆహారం దొరుకుతుందన్న ఆశతో పాఠశాలలో చేర్పిస్తుంటే అరకొర ఆహారం ఇచ్చి అక్కడ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు..పిల్లలకు పస్తులు లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కొంతమంది సిబ్బంది బరితెగించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ‘ఆంధ్రజ్యోతి’ రేగిడి మండలం దేవుదల కస్తూర్బా పాఠశాలను సందర్శించగా అక్కడ విద్యార్థులు పడుతున్న బాధలు వెలుగుచూశాయి..!

గుడ్లు కోత విధించడం వాస్తవమే
ఈమధ్య కాలంలో విద్యార్థులకు గుడ్లు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం వాస్తవమే. వర్షాకాలం వ్యాధులు వస్తున్నా దృష్ట్యా కోత విధించాం. పాలు విషయానికొస్తే అధికారులు అధికారులు మూడు లీటర్లన్నర ఇవ్వడంతో అవే విద్యార్థులకిచ్చాం.
పెదకాపు కన్నమ్మ, కుక్‌. కస్తూర్బా పాఠశాల.

వారు ఏమివ్వమంటే అవే ఇస్తాం
మా మేడమ్‌ పిల్లలకు ఏమి ఇవ్వమని చెబితే అవే ఇస్తాం. ఈ మధ్యకాలంలో గుడ్లు పూర్తిస్థాయిలో ఇవ్వవద్దని ఆదేశించడంతో అందజేయలేదు. సరుకుల కోత గురించి మాకు తెలియదు మా అధికారులకే తెలుసు.
పెదకాపు లక్ష్మీ, వంటమనిషి.

వారానికి మూడు సార్లే గుడ్డు
మాకు వారానికి మూడు సార్లే గుడ్డు ఇస్తున్నారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లోనే గుడ్డు ఇస్తున్నారు. మిగిలిన రోజుల్లో సాదా కూరలతో భోజనం పెడుతున్నారు.
ఎన్‌.అపర్ణ, విద్యార్థిని.