desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:26AM

భూమ్‌


(భోగాపురం/బొబ్బిలి)
భోగాపురంలో విమానాశ్రయం, బా డంగిలో వైమానిక స్థావరం ఏర్పాటు చేస్తారనే కథనాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూ ముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పుడే రియల్టర్లు సూట్‌కేసులతో కార్లలో దిగిపోతున్నారు. ఈ ప్రాంతంలో ముందుగానే భూములను కొనుగోలు చేసి, తమ వెంచర్లను అభివృద్ధి చేసుకోవాలని వారు భావిస్తున్నారు. దీంతో ఇక్కడి భూములకు ఎక్కడలేని వి పరీతమైన డిమాండ్‌ పలుకుతోంది. భోగాపురం ప్రాంతంలో నెలరోజుల కిందట విమానా శ్రయం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం అధికారులను పం పించింది. స్థానిక రెవెన్యూ అధికారులు మండలంలోని పలు గ్రామాల పరిధిలో సుమారు 2560 ఎకరాల వీరికి భూములను చూపించా రు. అయితే సంబంధిత స్థలం సరిపోదని మ ళ్లీ మ్యాప్‌ మార్పు చేసి పంపించాలని రెవె న్యూ అధికారులకు సూచించడంతో, వారు సు మారు 3580 ఎకరాలకు సంబంధించి వివరా లను ఎయిర్‌పోర్టు అధికారులకు అందజే శా రు. అదేవిధంగా బొబ్బిలికి దగ్గరలోని బాడంగి లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తొలు త రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అక్కడే ఉన్న బ్రిటీష్‌ కాలం నాటి వైమానిక స్థావరాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఆలోచన చేసింది. ఇ దే తడవుగా రాష్ట్రమంత్రి నారాయణ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అయితే ఇక్కడ విమానాశ్రయంకు బదులుగా, ఇప్పటికే ఉన్న వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలి సింది. ఈమేరకు తూర్పు నౌకాదళానికి ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసినట్టు స మాచారం.
ధరలు పైపైకి..
విమానాశ్రయం, వైమానిక స్థావరాల ఏర్పాటు నేపథ్యంలో భోగాపురం మండలంలోని గూడెపువలస, కంచేరు, కవులవాడ, బాడంగి మండల పరిధిలోని గ్రామాల రైతులను, రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దళారులు మచ్చిక చే సుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఆ యా ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భోగాపురం ప్రాంతంలో రెండు నెలల క్రితం ఎకరా భూమి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.6లక్షలు ఉండగా ప్రైవేట్‌ ధర సుమారు రూ.20 లక్షల నుంచి 25 లక్షల వర కూ ఉండేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ధర అదేవిధంగా ఉండగా, మార్కెట్‌ ధర రూ25 లక్షల నుంచి రూ30 లక్షలు పలుకుతోంది. ఎ వరైనా ఈ ప్రాంతంలో స్థలం కావాలని వస్తే చాలు వారిని రియల్‌ ఎస్టేట్‌దారులు, మధ్యవ ర్తులు విమానాశ్రయం వచ్చేసినట్టు, పక్కనే బీచ్‌ ఉన్నట్టు, ఇక్కడ స్థలం తీసుకుంటే ఎంతో అదృష్టమని నమ్మబలుకుతున్నారు. మరికొన్ని రోజులుంటే ఈ స్థలం కూడా దొరకదని చెబుతున్నారు. ఇక్కడ భూములు ఎంతో విలువైన వంటూ ఆకాశాన్నికెత్తేస్తున్నారు. వీటికి ఎంతో గిరాకీ ఉందని అనేక విధాలుగా మభ్యపెట్టి స్థలాలను అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నా రు. మధ్యవర్తులు రైతుల వద్దకు వెళ్లి విమా నాశ్రయం వస్తే భూములన్నీ ప్రభుత్వం తక్కు వ ధరకు తీసుకుంటుందని నమ్మించి వారు భూములను అమ్మేవిధంగా చేస్తున్నారు. ఇది లాఉంటే బాడంగి పరిసర ప్రాంతాల్లో కూడా భూముల రేట్లు అధికంగా పలుకుతున్నాయి. ఇక్కడ ఒకొక్క ఎకరా రూ.50 లక్షల నుంచి 80 లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రధానంగా ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న బొబ్బిలి పట్టణంతో పాటు గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తామనుకుంటున్న పాచిపెంట కూడా బాడంగికి దగ్గరగా ఉండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మరింత ఊపునిస్తుంది. ఇప్పటికీ బాడంగి ఎరోడ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌ వంటి ప్రఽధాన నగరాల రి యల్‌ వ్యాపారులు బాడంగి పరిసర ప్రాంతా ల భూములపై కన్నేశారు. కొంతమంది రియ ల్‌ వ్యాపారులు అప్పుడే భూములు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇటీవల వైమానిక స్థావరాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా తూర్పు నౌకాదళానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర ప త్రం జారీ చేయడంతో వైమానిక స్థావరం అ భివృద్ధికి మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. ఈంతో వ్యాపారులు ఇక్కడ రియల్‌ వ్యాపారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయం, వైమానిక స్థావరం ఏర్పాటు సంగతేమో గానీ. రియల్‌ ఎస్టేట్‌దారులు శతశాతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

జూ