Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:25AM

విద్యార్థినికి జేసీఐ ఫెమీనా ఆర్థిక సహాయం

శ్రీకాకుళం కల్చరల్‌: జేసీఐ ఫెమీనా వారోత్సవాల్లో భాగంగా ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినికి ఆ సంఘ సభ్యులు శనివారం ఆర్థిక సాయం చేశారు. స్థానిక క్వాలిటీ వాల్స్‌ పార్లర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భా గంగా వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదు వు తున్న సరోజ అనే విద్యార్థినికి ఫీజు నిమిత్తం రూ. 20వేలు ఆర్థిక సహా యాన్ని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జేసీఐ ఫెమీనా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫెమీనా వ్యవ స్థాపక అధ్యక్షురాలు నీలిమాప్రసాద్‌, ప్రస్తుత అధ్యక్షురాలు మొదల వ లస రేవతి, పూర్వ అధ్యక్షరాలు ఎస్‌.శోభారాణి, కార్యదర్శి సీహెచ్‌ శ్రీమ హాలక్ష్మి, రేపాక రోజా, పేర్ల అనూరాధ, హరిప్రియ పాల్గొన్నారు.