Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:21AM

అధికారుల్లో హడావుడి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపర్యటన నేపథ్యంలో అధికారుల్లో హడావుడి కన్పిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 17, 18 తేదీల్లో చంద్రబాబునాయుడు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ఏడు మిషన్లను ఏర్పాటు చేసి, ఆయా శాఖల పనితీరును సమీక్షించనున్నారు. రైతుసదస్సు, మహిళా సంఘాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం సంతరించుకోనున్న నేపథ్యంలో అధికారులంతా పూర్తి సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆదేశాలు జారీచేశారు. జేసీ వీరపాండియన్‌ కూడా సమీక్ష నిర్వహించి, ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రైతు, మహిళా సంఘాల సదస్సుల్లో సంబంధిత శాఖలు స్టాల్స్‌ఏర్పాటు చేయాలన్నారు. రుణఅర్హత కార్డుదార్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రుణాలందించేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదార్లకు ఆస్తుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. దీంతో అధికార యంత్రాంగం శాఖలవారీ సమాచార సేకరణలో నిమగ్నమైంది. అయినప్పటికీ మరోవైపు వారి గుండెల్లో గుబులురేగుతోంది. ముఖ్యమంత్రి ఏ విషయంపై ఎవరిని ప్రశ్నిస్తారో? అన్న భయం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి ప్రధానంగా రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి