Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:21AM

వచ్చామా.. వెళ్లామా!

అరసవల్లి: జిల్లా కేంద్రం శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉన్న అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి దేవాలయంలో సుమారు రూ.10 లక్షల విలువ చేసే తలనీలాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై నిజానిజాలు తేల్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పలు అను మానాలకు తావిస్తోంది. దొంగలు పడ్డ ఆరునెలలకు అన్న చందంగా చోరీ జరిగిన వారం రోజుల తరువాత శనివారం మధ్యాహ్నం అర సవల్లిలో దేవాదాయ శాఖ డీసీ ఎంవీఎస్‌ఎస్‌ఎన్‌ మూర్తి పర్యటన చర్చనీయాంశమైంది. హడావిడిగా వచ్చి కేవలం 15 నిమిషాలు స మయం కేటాయించి, అప్పటికి విధుల్లో ఉన్న సిబ్బందిపై చిర్రుబుర్రులాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నలుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేశామంటూ.. అక్కడితో తమ పని అయిపోయిందన్న భావనలోనే డీసీ ఉండడం కొసమెరుపు.
కొరవడిన క్రమశిక్షణ!
క్రమశిక్షణారాహిత్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని డీసీ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఓ ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నువ్వు నన్ను సస్పెండ్‌ చేస్తే.. నువ్వు ఆ పదవిలో ఎలా ఉంటావో చూస్తామంటూ పరోక్షంగా డీసీని హెచ్చరించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆధిపత్య పోరుకు మరోసారి అరసవల్లి వేదికగా మారిందని చెప్పవచ్చు. ఆలయంలో సిబ్బంది కొరత ఉందని, ఉన్న సిబ్బందితో పనిచేయించుకోవాల్సిందిపోయి.. డీసీ స్థాయి వ్యక్తి కూడా సిబ్బందిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారని, దీంతో తాను సైతం డీసీతో వాదనకు దిగినట్లు ఓ ఉద్యోగి బాహాటంగానే చెప్పడం గమనార్హం.
సీఎం పర్యటనలో భాగంగానే..
ఈనెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా అరసవల్లి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారని, ఆ దిశగా ఏర్పాట్లను సమీక్షించేందుకు దేవాదాయ శాఖ డీసీ ఎంవీఎస్‌ఎస్‌ఎన్‌ మూర్తి అరసవల్లిలో పర్యటించినట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన ముగిసేంతవరకు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆలయ ఉద్యోగులకు డీసీ సూచించారు. ఈ సందర్భంగా ట్రైమెక్స్‌ సంస్థ ఆర్థిక సాయంతో జరుగుతున్న ఇంధ్ర పుష్కరిణి పనులను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి రాకకు ముందురోజునే పనులు పూర్తిచేయాలంటూ సంబంధించిన కాంట్రాక్టర్‌కు ఆదేశించారు.
చోరీ.. ఇంటి దొంగల పనే !
భక్తుల తలనీలాలు చోరీ ఇంటిదొంగల ప నేనంటూ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషన ర్‌ మూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఆలయం లో సిబ్బంది కొరత విషయమై ఇప్పటికే క మిషనర్‌కు నివేదిక అందించామంటూ ఆయన చెప్పారు. నలుగురి సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్‌ చేసి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ట్లు ఆయన తెలిపారు. గతంతో పోల్చుకుంటే చోరీ సంఘటన పెద్ద విషయమేమీ కాదని చిరునవ్వు చిందించడం విశేషం.
అంతా హడావుడే!
శనివారం అరసవల్లిలో పర్యటించిన దేవా దాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వెంట ఉన్న ఆలయ ఈవో ఆర్‌.పుష్పనాథం కాస్త హడావు డి ప్రదర్శించారు. కేశఖండన శాలలో క్యూలైన్లో మరమ్మతులకు గురైన ప్లాస్టిక్‌ గ్రూప్‌లు బాగు చేయాలంటూ ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఇంద్రపుష్కరిణి వద్ద ఫ్లోరింగ్‌ పనులు పరిశీలిస్తున్న సమయంలో ఈవో హడావుడిగా అక్క డకు వచ్చి నేనే ఈవోనంటూ డిప్యూటీ కమిష నర్‌ ముందు సంబంధిత కాంట్రాక్టర్‌తో పరిచ యం చేసుకోవడంతో ఆలయంలో ఆయన పర్యవేక్షణ పనితీరుకు అద్దం పడుతోంది.