Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:20AM

వ్యవ‘సాయానికి’ యంత్రాలు


రాయితీపై పంపిణీకి సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ
(పార్వతీపురం టౌన్‌)
రాషీ్ట్రయ కృషీ వికాస్‌ యోజన కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించి 50 శాతం రాయితీతో వివిధ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులకు అందజేయడానికి సిద్ధంచేశారు. సాగులో మదుపులు, పెట్టుబడులు తగ్గిస్తూ కూలీల కొరతను అధిగమించే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులకు వివిధ రకాల వ్యవసాయ పరికరాలను అందించారు. ఇంకా అనేక పరికరాలను అందుబాటులో ఉంచారు. వీటిని రైతులు సబ్సిడీపై కొనుగోలుచేసుకోవచ్చునని పార్వతీపురం వ్యవసా యశాఖ సహాయ సంచాలకులు ఎం.సుధారాణి తెలిపారు. వీటిని పొందాలంటే రైతులు సంబంధిత మం డలాల వ్యవసాయాధికారులను సంప్రదించాలని చెప్పారు. యంత్రాల వివరాల్లోకి వెళ్తే..
మొక్కజొన్న ఒలిచే యంత్రం: మొయిజ్‌ షిల్లార్స్‌ కంపెనీకి చెందిన మొక్కజొన్న ఒలిచే ఒక యూనిట్‌ రాయితీతో రూ.2.46 లక్షలకు అందుబాటులో ఉంది.
మల్టీ క్రాఫ్‌ త్రిషర్లు: వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించి గింజలు వేరు చేసే యంత్రం ప్రతి యూనిట్‌కు రూ. 1.50 లక్షలు రాయితీతో రూ.60 లక్షలు ఉంది.
వరి కోసే యంత్రం: వరి పంట పండిన తరువాత కోసే యంత్రం ఒక యూనిట్‌కు రూ.45 వేలు రాయితీతో రూ. 9.60 లక్షల ఖరీదు ఉంది.



డ్రమ్‌ సీడర్లు: రాయితీపై డ్రమ్‌ సీడర్లను రైతులకు ఇచ్చేందుకు యూనిట్‌ ఖరీదు రూ.3.27 లక్షలు ఉంది.
పవర్‌ వీడర్లు: ఇంజన్‌తో నడిచే కలుపు తీసే యంత్రాలు 50 శాతం రాయితీపై రైతులకు ఇచ్చేందుకు సిద్ధం ఉన్నాయి.
ప్రొక్యూర్‌ మెంట్‌ సెంటర్లు: రాయితీపై గడ్డి చుట్టే యంత్రాలు, స్టోరేజ్‌ బిన్సు, పెయింటింగ్‌ మిషన్లు, హార్టెస్టర్లు తదితర యంత్రాలు రూ.50 లక్షల ధర వద్ద అందుబాటులో ఉన్నాయి.
హైకాస్ట్‌ మిషనరీ: 50 శాతం రాయితీతో లేజర్‌ గైడెడ్‌ లాండ్‌ లెవెల్లర్‌, ట్రాన్స్‌ ప్లాంటర్లు, మల్టీ క్రాఫ్‌ త్రిషర్లు తదితర పరికరాలను రూ.10 లక్షలకు ఇచ్చేందుకు సిద్ధం చేశారు.