Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:20AM

పునర్విభజనపై చర్చ

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించడంతో ప్రస్తుతం.. ఏఏ మండలాలు ఏఏ నియోజకవర్గాల్లో చేరతాయి. కొత్తగా ఏఏ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయనేది ప్రశ్న తలెత్తుతోంది. పునర్విభజన తర్వాత మన రాషా్ట్రనికి 175, తెలంగాణాకు 119 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కేటాయించారు. 2004లో నియోజకవర్గాల పునర్విభజ న జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల ఏర్పాటులో మార్పులేకపోయినా.. మరో మూ డు అసెంబ్లీస్థానాలు ఏర్పడే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్‌ పరిధిలో ఏడుఅసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. రాష్ట్రంలోని 13జిల్లాల్లోని 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225కి అసెంబ్లీ స్థానాలు పెరిగితే శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో 9 నియోజకవర్గాలు రానున్నాయి. దీనికి కారణం అసెంబ్లీ స్థానాలు పెరిగినా పార్లమెంట్‌ స్థానాలు పెరగకపోవటమే. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం పరిధిలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చోటు దక్కనుంది. అలాగే ప్రస్తుత అసెంబ్లీ స్థానాలే కుదింపుచేసి కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో ఇంతవరకు గరిష్టంగా ఐదు మండలాల వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండేవి. ఇవి తగ్గనున్నాయి. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. ఇవి తగ్గి కొత్త నియోజకవర్గంలో కొన్ని మండలాలు చేరే అవకాశం ఉంది. 2004లో నియోజక వర్గాల పునర్విభజనకు ముందు జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. వీటిలో ఉణుకూరు పోయి రాజాం నియోజకవర్గంగా రూపొందింది. అలాగే సోంపేట బదులు పలాస నియోజకవర్గం ఏర్పడింది. కాగా కొత్తూరు, హరిశ్చంద్రపురం నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వీటి పరిధిలోని మండలాలను చట్టుపక్కల నియోజక వర్గాల్లో చేర్చారు. అలాగే కొన్ని మండలాలు రెండు మూడు నియోజకవర్గాల్లో కలిసి ఉండేవి. కానీ పునర్విభజన తర్వాత మండలాన్ని యూనిట్‌గా చేసుకుని వివిధ మండలాలను నియోజకవర్గాలుగా ఏర్పాటుచేశారు. ఇపుడు మళ్లీ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే ఏగ్రామాలను నియోజకవర్గ కేంద్రాలుగా ఏర్పడనున్నది అందరిలో చర్చ జరుగుతోంది. ఠిు2ఆఇఠీస్సడఅగప్‌