Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:19AM

పత్రికలపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తే మూల్యం చెల్లిస్తారు -డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌

అనంతపురం, సెప్టెంబర్‌ 13: ప్రసార మాద్యమాలు, పత్రికలపై కక్ష సాధింపు దోరణితో ఎవరు వ్యవహరించినా మూల్యం చెల్లించక తప్పదని డిప్యూటి స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌, టీవీ-9 ప్రసారాలను నిలిపివేతపై ఆయన పై విధంగా స్పందించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రసారమాధ్యమాలు, పత్రికలపై ఆంక్షలు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఆంక్షలకు ప్రజల నుంచి వచ్చిన పరిణామాలు ఏ పాటివో చూశామన్నారు. పత్రికా, ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాలరాసి నా ప్రజలు అంగీకరించరన్నారు. కేసీఆర్‌ భాష ఆయన విజ్ఞతకే వ దిలేద్దామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధిదిశగా తీసుకువెళ్లేందుకు కష్టపడుతున్నారన్నారు.
కేసీఆర్‌ పద్ధతి మార్చుకోవాలి: డిప్యూటీ సీఎం కేఈ
వెల్దుర్తి: ఇప్పుడు హైదరాబాద్‌ను చూస్తుంటే కళ్లలో నీళ్లొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెర్లకొత్తూరులో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నగరం నుంచి కట్టుబట్ట లతో సాగనంపడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపివేయడం సరికాదన్నారు. దానిపై ధర్నా చేస్తున్న మహిళా జర్నలిస్టులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు. ఏపీలో విద్యుత్‌ సరఫరాను చూసి కేసీఆర్‌ కడుపు మండుతోందన్నారు. అక్కడ తన దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే తట్టుకోలేపోతున్నారన్నారు.
మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలి: జేఎసీ
అనంతపురం ఓల్డ్‌టౌన్‌: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాలు నిలుపుదల చేసిన కేసీఆర్‌ తమ వైఖరి మార్చుకొని మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండారు శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాలను నిరంకుశ దోరణితో ప్రసారాలు రద్దుచేశారన్నారు. అలాగే ఉపముఖ్యమంత్రి రాజయ్యను ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నిండుసభలో అవమానపరిచారన్నారు. తక్షణమే ఉపముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ప్రసారాలను పునరుద్దరించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి భవిష్యత్‌లో ఎన్నికలలో తగు బుద్దిచెప్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో నాయకులు జేవీ రమణ, ఎస్‌ బాబు, గుజ్జల నగేష్‌, శేషప్ప, రామాంజనేయులు, శంకరమూర్తి, షేక్షావలి పాల్గొన్నారు.
కేసీఆర్‌పై కర్నూలులో ఫిర్యాదు
కర్నూలు (క్రైం): తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 మీడియా సంస్థలపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కర్నూలు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో పి.మంజునాథ్‌నాయుడు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణిలో వెళ్తూ ప్రసారాలను నిలిపివేసి జర్నలిస్టులపై దాడి చేయించిన ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల తర్వాత విచారణ చేపడతామని సీఐ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.