Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:18AM

29 నుంచి డీసీఏ ఎన్నికలు

అధ్యక్ష స్థానానికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నామినేషన్‌
ఏకగ్రీవమయ్యే అవకాశం!
16వరకు నామినేషన్ల స్వీకరణ
(టెక్కలి)
జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌(డీసీఏ) ఎన్నికలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. అధ్యక్ష, కార్యదర్శులతోపాటు ఇతర పదవు లు, కార్యవర్గ సభ్యులకు సంబంధించి శనివారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 16వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అధ్యక్ష స్థానానికి సంబంధించి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శనివారం టెక్కలిలో నామినేషన్‌ వేశారు. జిల్లావ్యాప్తం గా సుమారు 48మంది సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొనున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నిక ఈసారి ఏకగ్రీవమయ్యే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డీసీఏ అధ్యక్షుడిగా రామ్మోహన్‌నాయుడు ఎంపికైన తర్వాత ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లో కూడా స్థానం సంపాదించే అవకాశముందని పేర్కొంటున్నారు.
కార్యక్రమంలో ప్రస్తుత జిల్లాక్రికెట్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌వీ నాయు డు, కార్యదర్శి భాస్కరరావు, ఉపాధ్యక్షుడు బోయిన రమేష్‌తోపాటు డాక్టర్‌ జగన్నాఽథరా వు, ఈశ్వరరావు, రాజేష్‌, ప్రభాకర్‌, కీర్తికు మార్‌, పాపారావు, ఎన్‌ఎస్‌ ప్రసాద్‌, నాగ భూషణరావు, సూర్యారావు, ఆకుల ప్రకాస్‌, తవిటయ్య తదితరులు పాల్గొన్నారు.