Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:16AM

నాయకుడంటే సేవకుడే

. నందమూరి వంశానికి ప్రజలే శ్రీరామరక్ష : బాలకృష్ణ
 
హిందూపురం, సెప్టెంబ ర్‌ 13 : నాయకుడంటే సేవ కుడేనని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శనివారం అనంతపురం జి ల్లా హిందూపురంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ తనకు తండ్రి, గురువు, దైవం అన్నీ ఎన్టీఆరే అన్నారు. నందమూరి వంశం ఈ స్థాయికి చేరిందంటే దానికి కారణం ప్రజలే అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం అందరినీ సమానస్థా యి లో ఆదరించడానికి పుట్టిందే తెలుగుదేశమన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ బాటలోనే పయనిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తున్నారన్నారు. తన జీవితంలో రెండోదశ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రావిళ్ళ లక్ష్మీ, వైస్‌ చైర్మన్‌ జేపీకే రాము తదితరులు పాల్గొన్నారు.