Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:15AM

టీటీడీ చైర్మన్‌ ఇస్తానంటే వద్దంటానా!: ఎంపీ రాయపాటి

తిరుమల, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యో తి): టీటీడీ చైర్మన్‌ పదవిని సీఎం చంద్రబాబు ఇస్తానంటే వద్దంటానా? అంటూ నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్‌ పదవిని ఎవరికో ఇస్తానని చంద్రబాబు ప్రామిస్‌ చేశారు కనుక తానా పదవిని కోరలేదన్నారు. ప్రథమంగా దేవుడి ఆశీస్సులు, తర్వాత ముఖ్యమంత్రి తలచుకుంటే ఆ పదవి వరిస్తుందన్నారు. శ్రీవారి ఆలయంలో మూడు వరుసల క్యూలైను విధానం భక్తులకు చాలా చక్కగా ఉపయోగపడుతోందని రాయపాటి అభిప్రాయపడ్డారు.