Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:14AM

బాబు సారథ్యంతో విద్యకు పెద్దపీట

. ఐదేళ్లలో 9లక్షల ఉద్యోగాలు: మంత్రి పల్లె
 
హిందూపురం, సెప్టెంబర్‌ 13: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు పెద్దపీట వే స్తున్నట్లు సమాచార, ప్రసార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. శనివారం అనంతపురం జిల్లా హిందూపురంలో మాట్లాడుతూ టీడీపీ విద్య, వైద్యానికి ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. చదువులో సమూల మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో గర్వించదగేలా విద్యలో మార్పులు తెస్తామన్నారు. హిందూపురాన్ని పారిశ్రామిక, విద్య, ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఇక్కడ విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించే విధంగా చొరవ చూపుతామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ పరంగా 5లక్షలు, ఎలక్ర్టానిక్స్‌ రంగంలో 4లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి అయ్యారంటే ఆయనకున్న పట్టుదల, శ్రమ, కృషివల్లే సాధ్యమైందన్నారు.