Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:13AM

వ్యవసాయ ఉపకరణాలేవి?

. సీజన్‌ సగం ముగిసినా జాడలేని తీరు

. అరకొర పరికరాలతో రైతులు అవస్థలు
 
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు సబ్సిడీపై ఇచ్చే వ్యవసాయ ఉపకరణాల సరఫరా ప్రక్రియ ఈ ఏడాది నత్తనడకన సాగుతోంది. రైతుకు ఆధునిక పరికరాల కొనుగోలుకు ఏటా రూ.150 నుంచి రూ.200 కోట్ల సబ్సిడీ రైతులకు ఇస్తున్నారు. మార్కెట్‌లో లెవలింగ్‌ బ్లేడ్‌ రూ.10 వేలు ఉంటే, అందులో 4 నుంచి 5 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మార్కెట్‌ రేటు కన్నా తక్కువకు లభించే ఇనుప నాగళ్లు, విత్తనాలు నాటే యం త్రాలు, కలుపుతీసే పరికరాలు, ట్రాక్టర్ల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఏడాది వీటి సరఫరా నేటికీ పూర్తికాలేదు. వ్యవసాయ ఉపకరణాలను రైతులకు అందజేసేందుకు రెండు నెలల క్రితమే టెండర్లు పిలిచారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఆధ్వ ర్యంలో టెండర్లయితే పిలిచారు గానీ, నేటికీ కంపెనీలను ఎంపిక చేయలేదు. ఈ పరిస్థితిపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉపకరణాల సరఫరా ప్రక్రి య విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధిత ఏడీకి ఫోన్‌ చేసినా, ఆయన ఫోనే కూడా తీయడం లేదని వాపోతున్నారు. వ్యవసాయ ఉపకరణాల సరఫరా ప్రక్రియలో, కంపెనీల ఎంపికలో మతలబులు చోటుచేసుకుంటున్నాయి. మార్కెట్‌లో ’9 టైన్‌ కల్టివేట్‌’ రూ.18,000కు లభిస్తుంటే..అంతకన్నా తక్కువ ధరకు కంపెనీలు కోట్‌ చేయాలి. అయితే రిటైల్‌గా దొరికే ధరలనే ఆయా కంపెనీలు కోట్‌ చేస్తున్నాయి. అధికారులు అవే ధరలను ఆమోదించి మమ అనిపిస్తున్నారు. ఈక్రమంలో కమీషన్లు చేతులు మారుతున్నాయి. ఆయా కంపెనీలు జిల్లాస్థాయిలో కూడా ఎంతో కొంత అధికారులకు ముట్టజెబుతున్నాయి. కాగా గత రెండేళ్లుగా వ్యవసాయ ఉపకరణాల ధరలను టెండర్ల కమిటీ మార్చలేదు. 2012-13లో ఆమోదించిన ధరలనే 2013-14లో కొనసాగించారు. మరి ఈ ఏడాది ఏం చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.