Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:12AM

మిత్రపక్షమైనా నిలదీస్తాం

. బీజేపీ ఎల్‌పీ నేత అశోక్‌కుమార్‌రాజు
 
నెల్లూరు (రంగనాయకులపేట), సెప్టెంబర్‌ 13: ప్రజా సమస్యలపై రాజీపడేది లేదని, మిత్రపక్షమైనా టీడీపీని కూడా నిలదీస్తామని బీజేపీ శాసనసభ పక్ష నేత పి. అశోక్‌కుమార్‌రాజు అన్నారు. శనివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ రాష్ట్ర విభజన గాయం నుంచి ప్రజలతో పాటు అధికార యంత్రాం గం ఇంకా కోలుకోలేదన్నారు. హైదరాబాద్‌లో పనికిరాని బిల్డింగ్‌లను ఏపీకి కేటాయించారనీ, కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన స్పెషల్‌ ప్యాకేజీలు, ఇన్సెంటివ్‌లు 15 ఏళ్ల పాటు అమలు చేయాలన్నారు. నిధుల కోసం కేంద్రంపై ఎక్కువగా ఆధారపడి ఎదురుచూడడం సరికాదన్నారు. నూతన రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి మూడు లక్షల కోట్ల నిధులు కావాలని అంచనాలను సిద్ధం చేస్తున్నారని, కేంద్రంకు కూడా నిధులు ఇచ్చేందుకు కొన్ని పరిధులు ఉన్నాయన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడ సమీపంలో కాకుండా వివిధ చోట్ల ఏర్పాటు చేస్తే ప్రయోజనంగా ఉంటుందన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరేష్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరును స్మార్ట్‌ సిటీగా మార్చేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన వంతుగా కృషి చేస్తారన్నారు.