Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:11AM

బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

. ముందువచ్చినవారికి ముందు ప్రాతిపదికన గదుల కేటాయింపు

. 23న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుమల, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఈనెల 26 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న సందర్భంగా 25వ తేది నుంచే ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ప్రొటోకాల్‌ మినహా వీఐపీ బ్రేకులు, గదులకు సిఫార్సులు ఆపేయనున్నారు. 25న శ్రీవారి ఆలయంలో అంకురారోపణ, 26న ధ్వజా రోహణంతో ఉత్సవాలకు నాందిపలుకుతారు. ఆ రోజు వేకువజామున సుప్రభాతం మినహా మిగిలిన సేవలు (తోమాల, ఆర్చన, వారపు సేవలైన కల్యాణోత్సవం, డోలో త్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ) రద్దు చేశారు. ఇన్నాళ్లు బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉండేది. ఈ ఏడాది రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో జారీచేశారు. దీంతో నిర్ణీత సమయంలో వారికి దర్శనం కల్పిస్తారు. తిరుమలలో రూ.300 టికెట్ల కరెం టు బుకింగ్‌లో మాత్రం టికెట్లు జారీచేయరు. అలాగే గదుల అడ్వాన్సు బుకింగ్‌ విధానాన్ని రద్దు చేశారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా తిరుమలకు ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన గదులు కేటాయించనున్నారు. దాతలు స్వయంగా వస్తేనే గదులను ఇస్తామని టీటీడీ అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాల్లో వికలాంగులు, వృద్ధులకు మహద్వార ప్రవేశం రద్దు చేసేవారు. ఈ ఏడాది వారిని ఆలయంలోకి అనుమతించే స్థలాన్ని దక్షిణ మాడవీధికి మార్చారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో వారికి దర్శన అవకాశం కల్పించాలా? లేదా? అనే విషయంలో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఇక సుపథం నుంచి అను మతించే చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రవేశాన్ని రద్దు చేస్తూ నిర్ణయించారు. కాగా, బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే తమిళులకు అత్యంత ప్రాధాన్యమైన పెరటాసిమాసం ప్రారంభమవుతుంది. దీనికి తోడు దసరా సెలవులు రావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో గరుడసేవకు సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది. తదనుగుణంగా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు. ఉత్సవాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించారు. భక్తులు ఎక్కువగా తిరిగే మాడవీధులతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ అద నపు సిబ్బందితో శుభ్రంగా ఉంచనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటుండటంతో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినా వెంటనే చికిత్స అందించేలా శాశ్వత వైద్యశాలతో పాటు తాత్కాలిక వైద్యశిబిరాలు, హోమియోపతి, ఆయుర్వేదం చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ, పుష్పప్రదర్శనశాల, పలు దేవతామూర్తుల భారీ కటౌట్లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలో భక్తులకు సేవలు అందించేందుకు తిరుపతి నుంచి డిప్యుటేషన్‌పై అదనపు సిబ్బందిని నియమించనున్నారు. ఉత్సవాల్లో ప్రధానమై.. ధ్వజారోహణం, గరుడసేవ, స్వర్ణరథోత్స వం, మహారథోత్సవం, చక్రస్నానంలకు భక్తులు విశేషంగా తిరుమల రానున్నారు.
ఆభరణాల శుభ్రత
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, రాత్రివేళలలో ఉత్సవర్లను విశేష అలంకరణలతో పలు రకాల వాహనాలపై ఊరేగిస్తారు. 9 రోజులపాటు ఉత్సవర్లకు అలంకరించేలా వివిధరకాల ఆభరణాలను శుభ్రం చేశారు. వీటిని భద్రపరిచి ఏడా ది కావస్తున్న నేపథ్యంలో జ్యువెలరీ సిబ్బంది దుమ్ము, ధూళిని తొలగించి నిగనిగ లాడేలా శుభ్రపరిచారు. ఒక్కో వాహనానికి సంబంధించిన నగలను వేరుచేశారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 23న (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరు మంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం జరిగే అష్టదళపాద పద్మారాధన సేవను రద్దు చేశారు. సర్వదర్శనం కూడా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, ఆలయ శుద్ధిలో పాల్గొనదలచిన భక్తులు ఒక్కొక్కరికి రూ.300 ఆర్జితం చెల్లించాల్సి ఉంటుంది.
త్వరలో మీసేవా కేంద్రాల్లో రూ.300 ఆన్‌లైన్‌ టికెట్లు: జేఈవో
మీసేవా కేంద్రాల్లోనూ త్వరలో రూ.300 ఆన్‌లైట్‌ టికెట్లను విక్రయించనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సూచనమేరకు భక్తులకు సులభ దర్శనంపై పలు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ-దర్శన్‌ కేంద్రాల్లో మిగులుతున్న టికెట్లను మీ-సేవా కేంద్రాల్లో విక్రయించాలనే యోచనలో ఉన్నామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. గరుడసేవకు హాజరయ్యే భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమాడవీధుల్లో గ్యాలరీలను విస్తరించామన్నారు. భక్తులు మొక్కుగా కొబ్బరికాయలు సమర్పించే అఖి లాండానికి కొత్త సొబగులతో తీర్చిదిద్దనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు చెప్పారు.