Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:11AM

ఊపిరాడక సింగరేణి కార్మికుడి మృతి

రామకృష్ణాపూర్‌ : మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఆర్కే 1ఎ గనిలో గాలి అందక కోల్‌ఫిల్లర్‌ కార్మికుడు చెవుల నారాయ ణ(54) మృతి చెందాడు. రాత్రి విధులకు హాజరైన నారాయణ 3సీమ్‌ 12డీప్‌ ఏరియాలో వి ధులు నిర్వహిస్తుండగా గాలి సరిపోవడంలేదంటూ తోటి కార్మికులతో చెప్పి తట్ట ఎత్తేసరి కే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని మిగిలిన కార్మికులు పేర్కొన్నారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏఐటీ యూసీ నాయకులు మ్యాన్‌వే వద్దకు చేరుకొని కార్మికుని మృతిపై యాజమాన్యం వైఖరే కారణమంటూ ఆందోళనకు దిగారు. గని మేనేజర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతు న్ని రామకృష్ణాపూర్‌లోని ఏరియాసుపత్రికి త రలించారు. కార్మికుని కుటుంబాన్ని గుర్తింపు సంఘం జనరల్‌ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షులు మెడిపెల్లి సంపత్‌ పరామర్శించి కార్మికునికి రావాల్సినటువంటి బెనిఫిట్స్‌తోపాటు 25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పి స్తామని, ఒకరికి వెంటనే ఉద్యోగ అవకాశం క ల్పించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్మికున్ని మందమ ర్రి మండల జడ్పీటీసీ కంబగోని సుదర్శన్‌గౌ డ్‌, క్యాతనపల్లి సర్పంచ్‌ జాడి శ్రీనివాస్‌, మందమర్రి నాయకులు జె. రవీందర్‌, ఏరియా సెక్రటరీ మెంగని రాజయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అ ధ్యక్షులు సమ్మయ్య పరామర్శించారు. ఆర్కే 1ఎ గనిలో కనీస సౌకర్యాలు కల్పించడంలేకపోవ డంతోనే నారాయణ మృతి చెందాడని గని కా ర్మికులు, కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐ ఎన్‌టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో శనివా రం నిరసన వ్యక్తం చేశారు. నారాయణ మృతి కి కారణమైన గని మేనేజర్‌ను వెంటనే తొలగించాలని, రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.ఖి