Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:11AM

కొత్త చట్టం అమలు చేసే దాక...ఓసీపీకి గుంట భూమి వదలం

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌లోని ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు విస్తరణకు తమ భూములను, గ్రామాన్ని లాక్కోవడానికి యత్నిస్తున్నారని కొత్త చట్టం అమలు చేసేదాక ఒక్క గుంట భూమి కూడ వదలబోమని సింగాపూర్‌ గ్రామ భూనిర్వాసితుల కమిటి నాయకులు స్పష్టం చేశారు. శనివారం భూ నిర్వాసితుల కమిటి అధ్యక్షుడు ఎం. రాజేంద్రపాణి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిపురం రామన్న, ప్రతినిధులు అగ్గు మల్లేష్‌, జనార్థన్‌, వడ్నాల రాయమల్లు, కుంట రామన్నలతో కలిసి శ్రీరాంపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ గ్రామానికి చెందిన 1600 ఎకరాల భూసేకరణకు 2008లో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికి ఇప్పటి వరకు గ్రామస్థులందరికి నష్టపరిహారం, పెరడు భూముల నష్టం, ఇండ్ల డబ్బులు, ఆర్‌అండ్‌ఆర్‌ పథకం అమలు చేయకుండానే ఓసీపీ డంప్‌యార్డుల గుట్టలతో తమ గ్రామాన్ని మూసివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం 300 ఎకరాలు మాత్రమే ఓసీపీకి తీసుకుంటామని శ్రీరాంపూర్‌ జీఎం ప్రకటించడం సమంజసం కాదన్నారు. కొంత భూమిని తీసుకొని గ్రామాౄన్ని వదిలేస్తే ఓసీపీ ప్రభావిత గ్రామంగా తామెల బ్రతుకగలుగుతామని ప్రశ్నించారు. సీఅండ్‌ఎండీ- చీఫ్‌ సెక్రటరి సమయంలో ఒప్పందం చేస్తే మరో ఆరు నెలలైనా వేచి ఉంటామని ప్రస్తుతం ఓసీపీకి గుంట భూమి వదలబోమని హెచ్చరించారు. స్థానిక సింగరేణి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల నోట్లో మట్టికొట్టడానికి కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఓసీపీ కమిటి నాయకులు బాకం శంకరయ్య, తోట కిష్టయ్య, బాపు, ఈర్ల రాజన్న, అగ్గు తిరుపతి, కుర్ర లింగేష్‌, సిద్దం శంకరయ్య, ముప్పు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.