Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:10AM

బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని... ఏఐఎఫ్‌డీఎస్‌ రాస్తారోకో, విద్యార్థుల ర్యాలీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎంసీపీఐయూ పార్టీ అనుబంధ ఏఐఎఫ్‌డీఎస్‌ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద శనివారం భారీ రాస్తారోకో నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో మానవహారం 2 గంటల పాటు నిర్వహించారు. దీంతో మెయిన్‌ బజార్‌లోని ప్రధాన రహదారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎంసీపీఐయూ చేస్తున్న జిల్లా సాధన పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. బెల్లంపల్లి జడ్పీటీసీ కారుకూరి రాంచందర్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేష్‌లు రాస్తారోకో వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంసీపీఐ యూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ మాట్లాడుతూ తూర్పు జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు అందుబాటులో సెంటర్‌లో ఉన్న బెల్లంపల్లి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎవరిప్రయోజనాలకోసం మంచిర్యాల జిల్లా ప్రకటించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. బె ల్లంపల్లి జిల్లా సమస్య అనేక దశాబ్దాలుగా పేరుకుపోయి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కొండగొర్ల చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి లింగంపల్లి భీమేష్‌, సహాయ కార్యదర్శి కొట్రంటి రాజు, ఎఐఎఫ్‌ డీవై జిల్లా కార్యదర్శిసబ్బని రాజేంద్రప్రసాద్‌, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్‌, ఎఐసీటీయూ జిల్లా కార్యదర్శి కర్నె మధుసుధన్‌, సహాయ కార్యదర్శి కర్నె రవికుమార్‌, మేరుగు ప్రసాద్‌లతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బెల్లంపల్లి జిల్లా సాధించి తీరుతామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.





జజజజఁ్సడ+×ప్ణ