Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:10AM

ఘనంగా రుషి పంచమి ఉత్సవాలు

ఇంద్రవెల్లి : మండలంలోని అందునాయక్‌ తాండ గ్రామంలో లభాన సమాజ్‌ సంఘం వారు రుషి పంచమి వేడుకలను శనివా రం ఘనంగా ప్రారంభించారు. ఆరాద్య దైవమైన కాళుబాబా ను పూజిస్తూ వారి జీవిత చరిత్రను వివరిస్తూ వేడుకలను జరుపుకుంటన్నారు. ఆవుల కాపరిగా కాళుబాబా అడవీలో ఉంటూ తీవ్రమైన ఎండలో పండుకోగా సాక్షత్తు నాగేంద్ర దేవత ఆయనకు నీడను కల్పించిందని కుల పెద్దలు తెలిపారు. దేశంలోనే కాళుబాబాను లభాన జాతీ వారు ఇంటి దేవతగా పూజిస్తారని పెద్దలు తెలిపారు. అప్పటి నుంచి దేశంలోనే మహారాష్ట్ర, రాజస్తాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి అనేక సంఖ్యలో మథుర జాతీ వారు కలిసి రుషి పంచమిని ఘనంగా జరుపుకుంటారని పెద్దలు తెలిపారు. ఈ సందర్భం గా మాజీఎంపీ రాథోడ్‌రమేష్‌ రాంసింగ్‌ బాబా ఆశీస్సులు పొం దిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అం తకు ముందు మఽథుర మహిళలు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా లభాన సమాజ్‌ సం ఘం ఉపాధ్యక్షుడు థాన్‌సింగ్‌నాయక్‌బాసీ, జిల్లా అధ్యక్షు డు ప్రతాప్‌సింగ్‌, జయ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.






!2!7ుఽజూఞగీ౅లిఖీ