desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:10AM

చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలి

ఖానాపూర్‌ : విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలని ప్ర భుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ ఖలీల్‌, గజిటెడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీ ర శ్యాంనాయక్‌, సర్పంచ్‌ నేరెల్ల సత్యనారాయణ, జెడ్పీటీసీ తాళ్లపెల్లి సునీత పేర్కొ న్నారు. ఖానాపూర్‌ పట్టణంలోని ఎఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాల ప్రెషర్స్‌ డే కార్యక్రమాన్ని శనివారం సీఎంఆర్‌ ఫంక్షన్‌ హల్‌ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏ ర్పచుకుని ముందుకు సాగాలని సూచిం చారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వేణుగోపాలకృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు స క్కారం శ్రీనివాస్‌, నాయకులు రాజ్‌గంగన్న, సతీష్‌, సాడిగే హరిప్రసాద్‌, శోభన్‌బాబు, రాకేష్‌, ప్రిన్సిపాల్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.
హోరెత్తిన వేడుకలు
భైంసా: పట్టణంలోని సురలోక్‌ గార్డెన్స్‌లో శుక్రవారం వశిష్ట జూనియర్‌ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్స్‌డే వేడుకలు హోరెత్తిపోయాయి. మధ్యాహ్నం వేళలో ప్రారంభమైన వేడుకలు విద్యార్థుల ఆట,పాటల మద్య జోరు,హుషారుగా కొనసాగాయి. విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ త సంవత్సరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అం దించింది. కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్‌ శ్రవణ్‌ కుమార్‌,వైస్‌ ప్రిన్సిపల్‌ రఘువీర్‌ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో...
గర్మిళ్ల : మంచిర్యాల పట్టణంలోని ప్రే రణ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో విద్యార్థులు నృత్యాలతో హల్‌చల్‌ చేశారు. పట్టణంలోని శ్రీనివాసగార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వి ద్యార్థులు కూచిపూడి, దేశభక్తి గీతాలు, తెలంగాణ, జానపద గీతాలకు చేసిన నృ త్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ కృష్ణకుమార్‌, ప్రిన్సిపాల్‌ ఆంజనేయులు, డైరెక్టర్లు లక్కాకుల శ్రీనివాస్‌, దామోదర్‌రెడ్డి, ఎస్‌వి. రమణ, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.్సాడ ఒప