Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:10AM

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

దండేపల్లి: గోదావరి తీరం నుండి అక్రమంగా ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న కలపను శనివారం రాత్రి మంచిర్యాల మండలం రాపెల్లి గోదావరి తీరం వద్ద పట్టుకున్నట్లు హాజీపూర్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారిని అఽభిష్టవర ప్రదాయిని వెల్లడించారు. మంచిర్యాల మండలం కొండపెల్లి గోదావరి తీరం నుండి రాపెల్లి గ్రామానికి గోదావరిలో కొట్టుకువచ్చిన కలపను ట్రాక్టర్‌లో నింపుకొని రాపెల్లి వస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు మాటువేసి పట్టుకున్నారు. అందులో 27టేకుతుంగలు లభ్యమయ్యాయి, సుమారు వీటి విలువ రూ. 45వేలు ఉంటుందని, పట్టుబడిన ట్రాక్టర్‌, కలపను లక్షెట్టిపేట అటవీరేంజ్‌ కార్యాలయానికి తరలించామని ఆమెవెల్లడించారు.ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ హైమద్‌, ఎప్‌బీఓలు రాము, వెంకటేశ్వర్లు, భీమయ్య, శ్రీనివాస్‌లు ఉన్నారు.


్ఖ