Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:09AM

నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు

మంచిర్యాల రూరల్‌ : మంచిర్యాల పట్టణంలో మద్యం అమ్మకాలు పబ్లిక్‌ ప్లేస్‌లలో వి చ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆసుపత్రుల, డిస్పెన్సరీల, విద్యాసంస్థలకు అ త్యంత సమీపంలో పక్కనే ఏర్పాటు చేసినా చో ద్యం చూస్తున్న అధికారులు వీటికి లైసెన్స్‌లు ఇస్తున్నారు. బెల్లంపల్లి చౌరస్తా లాంటి ప్రాం తంలో నిరంతరం జనసం దోహం ఉంటుంది. మంచిర్యాల బస్టాండ్‌ ప్రాంతంలోను అదే పరిస్థితి. రోడ్లకు పక్కన పూర్తిగా మెడికల్‌ షాపు లు, దవాఖానాలు, విద్యాసంస్థలకు దగ్గరలో ఈ షాపులు ఉంటున్నాయి. దీంతో జనం ఇ బ్బంది పడుతున్నారు. పైగా తమ ఇంట్లో కు టుంబాల్లో ఇలాంటి షాపుల్లో మద్యం తాగి వస్తున్న వారు ఇల్లు గుల్ల చేస్తున్నారని వివా హితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్‌ ప్లేస్‌ల నుంచి బార్‌, బ్రాందీషాపులను ఎత్తివేయాలని జనం డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి బార్‌, బ్రాందీ షాపులకు అనుమతుల ని బంధనలు ఇలా ఉన్నాయి. విద్యాసంస్థలు, దే వాలయాలు, మసీదులు, చర్చిలకు దూరంగా బార్‌లు ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా యి. జాతీయ రహదారికి 50 మీటర్ల దూరం లో ఏర్పాటు చేయాలనే నిబంధనలు, ఆసుపత్రులకు దూరంగా, పబ్లిక్‌ ప్లేస్‌లకు దూ రంగా ఉండాలనే నిబంధనలు, అంతేకాకుండా బార్‌ లు నిర్వహించే వారు మంచి ఆహారం, బాత్‌రూంలు, మిగతా సదుపాయాలు ఏర్పాటు చే యాల్సి ఉంది. పరిశుభ్రమైన నీరు, చల్లని గా లి, 100 చదరపు గజాల స్థలంతో పాటు పా ర్కింగ్‌ స్థలం ఉండాలి. నిబంధనలకు విరుద్దం గా తూర్పు ప్రాంతంలో బార్లు నడుస్తున్నా యి. ఎక్సైజ్‌ శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలను చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల ప్రాంతంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ప్రైవేటు ఆసుపత్రిని ఆనుకునే బా ర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫైర్‌స్టేషన్‌ సమీపంలో ప్రైవేటు కళాశాల సమీపంలో, ఆసుపత్రికి పక్కనే మరో బార్‌ను ఏర్పాటు చేశారు. ఐబీ చౌరస్తాలో చుట్టు జనసందోహం ఉన్న ప్రాంతంలో రెండు, మూడు ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రభుత్వాసుపత్రుల స మీపంలో మరో బార్‌ ఏర్పాటు చేశారు. మంచిర్యాల బస్టాండ్‌ సమీపంలో ప్రైవేటు కళాశాలకు ఎదురుగా మరో బార్‌ను సైతం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేశారు. తూర్పు ప్రాంతంలో మొత్తం 7 బార్లకు ఎక్సైజ్‌ శాఖ అ నుమతినిచ్చింది. ఇందులో మంచిర్యాలలో 6 బార్లు, కాగజ్‌నగర్‌లో 1 బార్‌ నడుస్తున్నాయి. బార్లలో సీల్‌ మద్యం అమ్మకూడదనే నిబంధ న ఉంది. కానీ బార్లలో సీల్డ్‌ మద్యం అమ్ము తున్నారు. ఈ బార్‌లు నిబంధనలను పట్టించుకోకుండా నడుస్తున్నాయని ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. జన సందోహం ఉన్న ప్రాంతంలో బార్లు ఏర్పాటు చేయడం వల్ల మ హిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. ప్రైవేటు ఆసుపత్రుల పక్కన బార్లను ఏ ర్పాటు చేయడం వల్ల రోగులు ఈ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. నిబంధనలను పాటించకుండా ఏర్పాటు చేసిన ఈ బార్లపై ఎక్సైజ్‌ అధికారులు ఎలాంటి చర్య లు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బా ర్లను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్దంగా ఉంటే చర్యలు మంచిర్యాల ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాస్‌
తూర్పు ప్రాంతంలో నిబంధనలకు విరుద్దం గా బార్‌ షాపులు ఏ ర్పాటు చేస్తే కఠిన చ ర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా లైసెన్స్‌ ను రద్దు చేయడాని కి కూడా వెనకాడబోం. ఎప్పటికప్పుడు బార్‌ షాపులను తనిఖీ చేస్తున్నాం. చట్ట ప్రకారం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తే యజమానులపై చర్యలు తప్పవు.