desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:09AM

దయనీయం..

సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ప్రధాన పట్టణంగా పేరుగాంచిన బెల్లంపల్లిలో గల ప్రభుత్వాసుపత్రి బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు వైద్య సేవలందించేందుకు 1980లో 30 పడకలతో ఆసుపత్రి ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులకు గాను ముగ్గురు రెగ్యులర్‌, ఒకరు కాంట్రాక్టు, మరొకరు అవుట్‌ సోర్సింగ్‌, ఒక హెడ్‌ నర్సు, ఆరుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక రేడియోగ్రాఫర్‌ ఔట్‌సోర్సింగ్‌, ఫార్మాసిస్టు, ఇద్దరు ఏఎన్‌ఎంలు ఔట్‌ సోర్సింగ్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌ కాంట్రాక్టు , జూనియర్‌ అసిస్టెంట్‌ రెగ్యులర్‌, డార్క్‌రూం అసిస్టెంట్‌ ఔట్‌సోర్సింగ్‌, ల్యాబ్‌ అటెండెంట్‌ కాంట్రాక్టు, వార్డు బాయ్‌లు ముగ్గురు, దోబీ ఒకరు రెగ్యులర్‌, డ్రైవర్‌ ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రి ప్రధానంగా రాషీ్ట్రయ రహదారిని ఆనుకుని ఉండడం బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రి (టీ ఎస్‌వీపీసీహెచ్‌సీ) మూడున్నర దశాబ్దాలుగా అభివృ ద్ధి చెందక దయనీయ స్థితిలో ఉంది. ఎంతో విషాలమైన ఆపరేషన్‌ థియేటర్‌, ఆసుపత్రి విస్తరించేందుకు 20 ఎకరాల స్థలం, చాందా-హైద్రాబాద్‌ ప్రధాన రహదారిని ఆనుకుని అను కూలంగా ఉంది.
ఈ ఆసుపత్రిలో 2 వార్డులు 1 పురుషులకు, మరొకటి మహిళలకు ఉన్నాయి.గర్భిణులకు వేరు వేరుగా గదులున్నాయి. ప్రతి రోజు 500నుంచి 600 మందికి పైగా రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఈ ఆసుపత్రికి ప్రతి నెల రూ. 1.10 లక్షల మందులు, రూ. 10,500 సర్జికల్‌ పరికరాల కోసం వినియోగిస్తున్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న మందులు సర్జికల్‌ పరికరాలు 2 వారాల్లోనే అయిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా విష జ్వరాల బా రిన పడి చికిత్స కోసం వచ్చిన వారికి ఈ ఆసుపత్రిలో ఉన్న
పడక లు సరిపోక ఆరుబయటనే చికిత్స పొందుతున్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నేలపైనే చికిత్స పొందుతున్నారు.
అన్నీ సమస్యలే..
ఈ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య అధి కంగా ఉండడం, ఇక్కడ స్కానింగ్‌ సెంటర్‌, ఎనలైజర్‌ సౌకర్యం లేకపోవడంతో తీవ్రమైన జబ్బుతో ఉన్న వారికి తగు చికత్స అందించలేక మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌ పట్టణాలకు రెఫర్‌ చేస్తుంటారు. ఆసుపత్రిలో 6 సం వత్సరాలుగా జనరేటర్‌ పనిచేయడం లేదు. దీంతో ఎప్పుడైనా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఆసుపత్రి అంధకారంలో ఉండాల్సందే. అడవిని తలపించే విధంగా ఆసుపత్రి ప్రాంగణం, పరిసరాలు ఉండడంతో పాములు, వివిధ క్రిమి కీటకాలు ఆసుపత్రిలోకి వస్తుంటాయి. ఆసుపత్రికి వస్తే రోగాలు తగ్గడం దేవుడెరుగు అక్కడ పుష్కలంగా ఉన్న దోమలతో కొత్త రోగాలు వస్తున్నాయని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. 2 వార్డుల్లో వివిధ గదుల్లో ఫ్యాన్‌లు పనిచేయకపోవడంతో ఉక్క పోతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న మినరల్‌ వాటర్‌ ప్లాంటు 3 సంవత్సరాల క్రితం చెడిపోయినా పట్టించుకున్న వారే లేరు. రోగులు బోరు బావి నీటిని వినియోగిస్తున్నారు. ఈ ఆసుపత్రిని జిల్లా స్ధాయి ఆసుపత్రిగా అభివృద్ధి పరుస్తామని గతంలో జిల్లాలో పనిచేసిన కలెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌, ఏపీవీపీ నాటి కో ఆర్డినేటర్‌ రాధానాయర్‌లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఆసు పత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి పర్చాలని, మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేష్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేశారు.
దాదాపు రూ. 100 కోట్లతో అధునాతన సౌకర్యాలతో ఆసుపత్రిని అభివృద్ధి పరిచేందు కు ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా అవి నేటికి కార్యరూపం దాల్చలేదు. ఆ ఆసుపత్రిలో మౌ లిక సదుపాయాలు కల్పించి ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాల్సి ఉండగా ఎన్ని పాలకులు, ప్రజాప్రతినిధులు మారినా ఆ దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
అడ్వయిజరీ కమిటీ ఉన్నా
ప్రయోజనం శూన్యం..
ఈ ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మొత్తం ఎనిమిది మంది అడ్వయిజరీ కమిటీగా ఉంటారు. ఇప్పటికీ నాలుగు కమిటీలు మారినప్పటికీ ఈ ఆసుపత్రికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమే.
గైనకాలజిస్టు బదిలీకి ప్రయత్నాలు
ఈ ఆసుపత్రిలో ఒక సివిల్‌ సర్జన్‌, నలుగురు అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌లు, ఒక గైనకాలజిస్టు ఉన్నారు. ఉన్న ఏకైక గైనకాలజిస్టును ఇక్కడి నుంచి బదిలీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లేని సౌకర్యాలు ఎలాగూ లేవు, ఉన్న గైనకాలజిస్టును బదిలీకి ప్రయత్నించడం ఏంటని ప్రజలు వాపోతున్నారు. గైనకాలజిస్టును కొనసాగించాలని అదనంగా ఆర్థోసర్జన్‌ , ఎనిస్థీషియా డాక్టర్‌, జనరల్‌ సర్జన్‌ , లేడీ మెడికల్‌ ఆఫీసర్‌, మరో 50 మంది సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, జిల్లా వైద్య విధాన పరిషత్‌ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్యే చిన్నయ్య, ఎంపీ బాల్కసుమన్‌లు ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించి ఆస్పత్రిని అభివృద్ధి చేయాలంటున్నారు.