Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:09AM

తెగుళ్లు.. రైతుల గుండెల్లో గుబులు

తాంసి: ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ఏ పంట పొలాన్ని చూసిన తెగుళ్లు సోకి ఎండి పోతున్నాయి. వాస్తవానికి వర్షాలు కురుస్తే పత్తి పంట పచ్చగా ఉండాలి. కాని దీనికి భిన్నంగా పంటలు ఎండి పోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే కాత దశకు వచ్చిన పంటకు ఎండు తెగుళ్లు సోకుతుండడంతో రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు.
తాంసి మండలంలో మండల కేంద్రమైన తాంసితో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షాలు కురిశాయి. ఇంక కురుస్తూనే ఉన్నాయి. చాలా గ్రామాల్లో వర్ష పాతం ఎక్కువ కావడంతో పంట భూములు నీరు పట్టాయి. కొన్ని పంటలు కాత దశకు రావడం అప్పుడే భారీ వర్షాలు కురియడంతో కాయలన్నీ మురిగి పోతున్నాయి. పత్తి చెట్లన్ని తెగుళ్లు సోకి ఆకులు రాలి పోయి ఎండు బారుతున్నాయి. దీంతో రైతుల్లో మరింత ఆందోళన మొదలైంది. అసలే ఈ ఏడు మొదటి నుంచి కష్టాలతో పాటు నష్టాలను అనుభవిస్తున్న అన్నదాతకు ఈ ఎండు తెగుళ్లు మరింత బాధను తెచ్చి పెడుతున్నాయి. తాంసి మండలంలో ఈ ఏడు 68వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. అందులో ఈ పాటికే 70 శాతం వరకు పంటలకు తెగుళ్లు వ్యాపించాయి. మిర్చి పంట సైతం భారీ వర్షానికి నేలకొరిగింది. ఇంకా సోయ పంట విషయానికొస్తే పూత దశకు వచ్చిన ఈ పంటకు వర్షపాతం అధికం కావడంతో పూత రాలి పోతుంది. ఏమి చేయాలో తెలియక రైతులు నానా తంటాలు పడుతున్నారు. సూచనలు అందించాల్సిన వ్యవసాయ అధికారులు సైతం అంతగా స్పందించడం లేదని ఆరోపణలు మండలంలో సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.వెంటనే ప్రభుత్వం స్పందించి అన్నదాతను ఆదుకునేందు కోసం తగిన చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

్సడఫ