Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:09AM

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా..


ఆంధ్రజ్యోతి: ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ?
ఇంద్రకరణ్‌రెడ్డి : నియోజకవర్గ సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను.. నిర్మల్‌ నియోజకవర్గం జిల్లాలోనే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. ప్రధానంగా రైతులకు కరెంట్‌ సమస్యను పరిష్కరించేందుకు రెండు, మూడు రోజుల్లోనే సారంగాపూర్‌ మండలం జాం గ్రామంలో, నిర్మల్‌ మండలం మేడిపెల్లి గ్రామాల్లో 33/11 విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల నిర్మాణాన్ని ప్రారంభిస్తాం.. దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను చేపడు తాం. లక్ష్మణచాంద మండలం వెల్మల్‌ బొ ప్పారంలో 400 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను నిర్మిస్తాం. నియోజకవర్గంలో 17 సబ్‌స్టేషన్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. మరో ఏడాదిలోగానే వ్యవసాయానికి 7గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందజేస్తాం. దశల వారీగా ప్రజలకు ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తా.
ఆంధ్రజ్యోతి : గల్ఫ్‌, ముంపు బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
ఇంద్రకరణ్‌రెడ్డి: నియోజకవర్గంలో కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా వస్తున్న సమస్య ముంపు బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు 30 గ్రామాలకు గాను 100 కోట్ల నిధులను అందించేందుకు అంచనాలు తయారు చేసి ముఖ్య మంత్రి దృిష్టికి తీసుకెళ్లాను. త్వరలో బాధిత కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చొరవ తీసుకుంటా. నిర్మల్‌ నియోజకవర్గం నుంచి ఎక్కువగా గల్ఫ్‌కు వెళ్లారు. వెళ్లిన వారందరిలో పని నైపుణ్యం లేకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేరళ ప్రభుత్వం తరహా లో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గల్ఫ్‌కు వెళ్లేందుకు కార్యాచరణను రూపొందిస్తుంది.
ఆంధ్రజ్యోతి : నిర్మల్‌ పరిసరాల్లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
ఎమ్మెల్యే : నిర్మల్‌ కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాము. పట్టణానికి దగ్గరలోని కుంటాల, పొచ్చర జలపాతాలు, మహబూబ్‌ ఘాట్‌లు, పట్టణంలోని బత్తీస్‌గఢ్‌, శ్యాంగఢ్‌, నిమ్మ రాజుల కట్టడాలను, సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి పోచమ్మ, దిలావర్‌పూర్‌ మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయాలు, క డెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల త్వరలోనే పనులను ప్రారంభిస్తాం.
ఆంధ్రజ్యోతి : సాగు, తాగునీరు సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని చూపనున్నారు ?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో తాగునీటి, సాగునీటి సమస్య ఉంది. ఎక్కువగా బోరుబావుల కింద రైతులు సాగు చేస్తుంటారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా డీ 27 ప్యాకేజి కింద 700 కోట్ల రూపాయలతో హై లెవల్‌ కెనాల్‌ ద్వారా మరో 50వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి. సారంగాపూర్‌ మండలం దో నిగామ ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు నుంచి నిర్మల్‌ మండలంలోని చెరువులు నింపుతూ మామడ మండలం పరిమండల్‌ వద్ద పంప్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తాం.. దీనిద్వారా బంగల్‌పేట్‌ నుంచి దిమ్మదుర్తి వరకు చెరువులను నింపుతూ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా. మూడు సంవత్సరాల్లో పను లు పూర్తవుతాయి. ఎస్సారెస్పీ నుంచి నిర్మ ల్‌, మామడ, లక్ష్మణచాంద, దిలావర్‌పూర్‌ మండలాలకు, స్వర్ణ ప్రాజెక్టు నుంచి సా రంగాపూర్‌ మండలానికి తాగునీరు అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఆంధ్రజ్యోతి : పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం సాధ్యమేనా.. దీని కోసం ఎన్ని నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు?
ఎమ్మెల్యే : ఆవును సాధ్యమే.. ఎన్నికల సమయంలో ప్రజలకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చాము. ఈ మేరకు ఇప్పటికే సర్వే పనులు కూడ ప్రారంభించాం. సర్వే తరువాత డీపీఆర్‌ నివేదిక తయారు కాగానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మరో రెండు సంవత్సరాల్లో పనులను పూర్తి చేస్తాం. పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం.
ఆంధ్రజ్యోతి : వైద్య సేవల మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
ఎమ్మెల్యే : గతంలో జిల్లాలో డెంగూ్యు బాధితులను ఆదుకోవాలని జిల్లా కేంద్రంలో నిరసన తెలిపాము. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో డెంగ్యూ బాధితులను ఆ దుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో డెంగ్యు వ్యాధిని చేర్చేందుకు సాఽధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నాం. త్వరలో డెంగ్యూ బాధితులను ఆదుకోవడానికి కార్యాచరణను రూపొందించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుం టాం. ఈ వ్యాధిని ఆ రోగ్య శ్రీ పథకంలో చేర్చడంతో ప్రధానంగా పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. నిర్మల్‌ పట్టణ కేంద్రంలో నూతన ఏరియా ఆసుపత్రిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్పత్రికి అవసరమైన 1.5 కోట్ల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం..
ఆంధ్రజ్యోతి : నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం ?
ఎమ్మెల్యే : నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒ క్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. గతంలో నియోజకవర్గం లో పాదయాత్ర చేసి ప్రజ ల సమస్యలను పరిశీలించా. ప్రతి ఒక్కరు మెచ్చుకునేలా నిర్మల్‌ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహయ సహకారాలను అందించాలి. ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకొని అభివృద్ది కోసం అహర్నిషలు కృషి చేస్తా.