Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:08AM

విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి

కలెక్టరేట్‌: వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న 8,9,10 తరగతుల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం జగన్‌మోహన్‌ అన్నారు. శనివారం స్థానిక టీటీడీసీలో షెడ్యూల్డు కులాల సంక్షేమ వసతి గృహాల వార్డెన్‌ చర్చా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వసతి గృహాల్లోఉండి చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సదుపాయా లు, నాణ్యమైన భోజనం, వ్యక్తిగత శుభ్రత, మంచి విద్యా బోధన అందించాలన్నారు. వి ద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వే యడానికి విద్యా బుద్ధులు నేర్పించడం, వెనుక బడిన తరగతుల విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. వస తి గృహాల్లోని మరమ్మతులు పూర్తిగా చేపటి, మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్ల శుభ్రత చేపట్టాలని ఇంజనీరింగ్‌ డీఈ మధన్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో డీ డీ ఎ శంకర్‌, డీఈఓ సత్యనారాయణరెడ్డి, డీ ఈ మధన్‌, వార్డెన్లు పాల్గొన్నారు.
ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి
రైతులు బిందు, తుంపర్ల సేద్యం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చే పట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం. జగన్మోహన్‌ అ న్నారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బిందు, తుంపర్ల సేద్యం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ద్వారా నీటిని ఆదాతో పాటు తక్కువ ఖర్చు, ఎక్కువ పంట దిగుబడి సాధించవచ్చ న్నారు. సూక్ష్మ సేద్యం కింద ఇప్పటి వరకు 16703 హెక్టార్ల లో 106.30 కోట్ల సబ్సిడీతో సే ద్యం చేశామని, 36147 మం ది రైతులకు 16.014 కోట్ల స బ్సిడీపై స్పింక్లర్లను అందిం చా మన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1500 హె క్టార్లలో ఈ పథకం కింద స్ర్పింక్లర్ల ను 50 శా తం సబ్సిడీపై 1500 స్ర్పీంక్లర్లను రైతులకు అందిస్తామని, మండలాల వారీగా మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీ డీ జాదవ్‌ గణేష్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ముకుందం, ఆత్మ పీడీ మనోహర్‌, వ్యవసాయ శాఖ ఏడీ శ్యాంరావు, మైక్రో ఇరిగేషన్‌ పీడీ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను
విజయవంతం చేయాలి
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయవచ్చని కలెక్టర్‌ జగన్మోహన్‌ అన్నారు. శనివారం జిల్లా పరిష త్‌ సమావేశ మందిరంలో జరిగిన మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా స్థాయి స్టాక్‌హోల్డర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రజల ఆరోగ్య స్థితిగతులను బట్టి ఆ ప్రాంతం అభివృద్ధి జరిగిందని తెలుసుకోవచ్చన్నారు.
అదే విధంగా మరుగుదొడ్ల కార్యక్రమాన్ని యుద్ద ప్రతిపాదన నిర్మించుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2ల క్షల మరుగుదొడ్లు నిర్మింౄచామని, మరో 3.90 లక్షలు నిర్మించాల్సి ఉందన్నారు. ఈకార్యక్రమంలో డ్వామా పీడీ జాదవ్‌ గణేష్‌, ఐసీడీ ఎస్‌ పీడీ మీరాబెనార్జి, ఎంపీడీవోలు, ఏపీవో లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.